హైదరాబాద్ : మాజీ ప్రధాని వాజ్పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యలకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వకపోవటం వెలితిగా ఉందని కేసీఆర్ అన్నారు.
పీవీకి భారతరత్న ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాల్సిందన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
పీవీకి భారతరత్న ఇవ్వాల్సింది: కేసీఆర్
Published Wed, Dec 24 2014 2:17 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement