
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పీవీ స్మారకంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని తాను ప్రతిపాదన పంపగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు ఆమోదం తెలిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. త్వరలోనే పోస్టల్ శాఖ ద్వారా ఈ స్టాంప్ విడుదల కానుందని ఆయన పేర్కొన్నారు.
కేకే హర్షం
మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ‘ప్రత్యేక తపాలా బిళ్ల’విడుదల చేస్తుండటంపై టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు గురువారం హర్షం వ్యక్తంచేశారు. ఇందుకోసం చొరవ చూపిన సీఎం కేసీఆర్‌కు, కేంద్రానికి ఈ సందర్భంగా కేకే కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment