పీవీ నరసింహరావు, నీలం సంజీవరెడ్డి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని అందించిన ఘనత ఈ సెగ్మెంట్ దక్కించుకుంది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ప్రధాని పీవీ నరసింహరావు నంద్యాల నుంచి విజయం సాధించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికంటే ముందు.. 1977లో జరిగిన ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా జనతా పార్టీ తరఫున ‘నీలం’ ఒక్కరే గెలిచి రికార్డు సృష్టించారు. ఇక 1991లో ప్రధానిగా పీవీ నరసింహరావు ఎన్నికవడంతో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పీవీ కోసం రాజీనామా చేశారు. ఇక్కడినుంచి పీవీ రెండుసార్లు విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment