ఏ నాయకుడు అయినా ఆ పుణ్యక్షేతంలో రాత్రిపూట ఉన్నారో అంతే..! | The CM PM And President Not Staying Overnight In Ujjain | Sakshi
Sakshi News home page

ఏ నాయకుడు ఆ పుణ్యకేత్రంలో రాత్రిపూట బస చేయరు! ఎందుకో తెలుసా!

Published Tue, Aug 1 2023 2:30 PM | Last Updated on Tue, Aug 1 2023 3:11 PM

The CM PM And President Not Staying Overnight In Ujjain - Sakshi

భారతదేశంలో పురాతన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని చాలా మహిమాన్వితమైనది. ఈ నగరం దేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్ర స్థానంగా అలరారుతుంది. మధ్యప్రదేశ్‌లో శిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఈ నగర సాంస్కృతిక వారసత్వం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉజ్జయిని నగరంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి రాత్రిపూట బస చేయలేదట. ఇంతవరకు అలా ఎవ్వరూ ఉండేందుకు సాహసం చేయలేదట. ఎందకలా? దాని వెనుక దాగిఉన్న రహస్యం ఏంటీ?..

నిజానికి ఈ ఉజ్జయినిని మహాభారత కాలంలో 'అవంతి' అని పిలిచేవారు. వేదాలు, పురాణాలతో సహ వివిధ పురాతన హిందూ గ్రంథాల్లో ఈ నగరం ప్రస్తావన ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ నగరం పేరు చెప్పగానే విక్రమాదిత్యుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయనే ఇక్కడకు నిత్యం వచ్చి 'హరసిద్ధ' మాతను పూజించేవాడు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ప్రధాన అధి దేవత 'బాబా మహాకల్‌'. ఉజ్జయిని సర్వోన్నత ప్రభువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ నగరంలోని అన్ని అధికారాలు ఆయనవే. అందువల్ల అక్కడ ఏ నాయకుడు ఉండకూడదు. అలాగే ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండటం కుదరదు.

అందువల్ల ఏ నాయకుడు అక్కడ బస చేయరు. అది అక్కడ ఆచారం. దీన్ని అతక్రమించి ఉన్నవాళ్లందరూ విపత్కర పరిస్థితులు చూచిన దాఖాలాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఏ నాయకుడు ఆ సాహసం చేయకపోవడం విశేషం. నాయకులు ఈ ఆచారాన్ని అతిక్రమించకపోవడానికి మరో ప్రధాన కారణం రాజకీయ అంశం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండలి, అధికారంలో సాగాలంటే వారి ఆధరాభిమానాలు పొందాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో వారు ప్రజల మత విశ్వాసాలను గౌరవించక తప్పదు. ఆయా కారణాల రీత్యా కూడా నాయకులు దీనికి విరుద్ధంగా వెళ్లే సాహసం చేయలేదు. మరికొందరూ ఆ ఆచారానికి విరుద్ధంగా వెళ్లితే ఏమవుతుందన్న భయంతోనే.. మొత్తం మీద ఇంతవరకు ఏ నాయకుడు ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయలేదట. భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందో లేదో కానీ ఈ విషయం మాత్రం ఉజ్జయినీలో ఓ అంతుపట్టని మిస్టరీలా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement