ujjain Mahakali Temple
-
బాయ్‌ఫ్రెండ్‌తో ఆలయానికి జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది. దేశంలోని ప్రధాన ఆలయాలను సందరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన భామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు జాన్వీని ఆశీర్వదించి ఆమెకు బాబా మహకాళ్ ఫోటోను బహుకరించారు. అయితే ఆలయానికి గులాబీ రంగు చీరలో వెళ్లిన జాన్వీ స్వామివారి హారతి పూజలో పాల్గొన్నారు. అయితే ఆలయానికి వెళ్లిన జాన్వీ పక్కనే.. తన ప్రియుడిగా భావిస్తున్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. దీంతో మరోసారి జాన్వీ కపూర్‌పై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే జాన్వీతో శిఖర్ రిలేషన్ షిప్లో ఉన్నాడని సమాచారం. -
పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్
స్టార్ హీరోయిన్ పెళ్లి అంటే హడావుడి మాములుగా ఉండదు. బ్యాచిలర్ పార్టీ, షాపింగ్, ప్రిపరేషన్.. ఇలా చాలా పనులతో బిజీగా ఉంటారు. అయితే కొందరు మాత్రం మ్యారేజ్ కి ముందు దేవుడు-పూజలు లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా అలానే కాకపోతే ఈమెకు తోడు కాబోయే భర్త కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి దైవభక్తిలో మునిగి తేలుతుండటం విశేషం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) హీరోయిన్ పరిణితీ చోప్రా.. హిందీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించి పేరు తెచ్చుకుంది. గతేడాది ఓ రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ.. ప్రస్తుతం మరో రెండు మూవీస్‌లో నటిస్తోంది. ఓవైపు నటిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మేలో ఆప్ పార్టీ నాయకుడు రాఘవ చద్దాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాలేజీ రోజుల నుంచే వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నప్పటికీ నిశ్చితార్థంతో వీళ్ల రిలేషన్ బయటపడింది. ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ల పెళ్లి గురించి గాసిప్స్ వచ్చాయి. అయితే కొన్నిరోజుల ముందు మాత్రం తేదీ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 25న వెడ్డింగ్ జరగనుంది. దానికంటే ముందే పరిణితీ.. కాబోయే భర్త రాఘవ్ చద్దాతో కలిసి ఉజ్జయిని వెళ్లింది. మహంకాళేశ్వర స్వామి దర్శనం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. వాటిపై మీరు ఓ లుక్ వేసేయండి. (ఇదీ చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) Wedding soon? #ParineetiChopra and #RaghavChadha offer prayers at Ujjain’s Mahakaleshwar Temple 🙏🏻 #Pinkvilla pic.twitter.com/kPPnyH10Gv — Pinkvilla (@pinkvilla) August 26, 2023 आप सांसद राघव चड्ढा और उनकी मंगेतर, अभिनेत्री परिणीति चोपड़ा ने उज्जैन के महाकाल मंदिर में पूजा की 🙏🙏#raghavchadha #parineetichopra#mahakal pic.twitter.com/JPXsRGUxfg — Jahnvi Sharma (@Jahnvish999) August 26, 2023 -
ఏ నాయకుడు అయినా ఆ పుణ్యక్షేతంలో రాత్రిపూట ఉన్నారో అంతే..!
భారతదేశంలో పురాతన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని చాలా మహిమాన్వితమైనది. ఈ నగరం దేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్ర స్థానంగా అలరారుతుంది. మధ్యప్రదేశ్‌లో శిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఈ నగర సాంస్కృతిక వారసత్వం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉజ్జయిని నగరంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి రాత్రిపూట బస చేయలేదట. ఇంతవరకు అలా ఎవ్వరూ ఉండేందుకు సాహసం చేయలేదట. ఎందకలా? దాని వెనుక దాగిఉన్న రహస్యం ఏంటీ?.. నిజానికి ఈ ఉజ్జయినిని మహాభారత కాలంలో 'అవంతి' అని పిలిచేవారు. వేదాలు, పురాణాలతో సహ వివిధ పురాతన హిందూ గ్రంథాల్లో ఈ నగరం ప్రస్తావన ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ నగరం పేరు చెప్పగానే విక్రమాదిత్యుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయనే ఇక్కడకు నిత్యం వచ్చి 'హరసిద్ధ' మాతను పూజించేవాడు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ప్రధాన అధి దేవత 'బాబా మహాకల్'. ఉజ్జయిని సర్వోన్నత ప్రభువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ నగరంలోని అన్ని అధికారాలు ఆయనవే. అందువల్ల అక్కడ ఏ నాయకుడు ఉండకూడదు. అలాగే ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండటం కుదరదు. అందువల్ల ఏ నాయకుడు అక్కడ బస చేయరు. అది అక్కడ ఆచారం. దీన్ని అతక్రమించి ఉన్నవాళ్లందరూ విపత్కర పరిస్థితులు చూచిన దాఖాలాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఏ నాయకుడు ఆ సాహసం చేయకపోవడం విశేషం. నాయకులు ఈ ఆచారాన్ని అతిక్రమించకపోవడానికి మరో ప్రధాన కారణం రాజకీయ అంశం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండలి, అధికారంలో సాగాలంటే వారి ఆధరాభిమానాలు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ప్రజల మత విశ్వాసాలను గౌరవించక తప్పదు. ఆయా కారణాల రీత్యా కూడా నాయకులు దీనికి విరుద్ధంగా వెళ్లే సాహసం చేయలేదు. మరికొందరూ ఆ ఆచారానికి విరుద్ధంగా వెళ్లితే ఏమవుతుందన్న భయంతోనే.. మొత్తం మీద ఇంతవరకు ఏ నాయకుడు ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయలేదట. భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందో లేదో కానీ ఈ విషయం మాత్రం ఉజ్జయినీలో ఓ అంతుపట్టని మిస్టరీలా ఉంది. -
మహిళలపై దారుణంగా దాడి చేశారు