బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది. దేశంలోని ప్రధాన ఆలయాలను సందరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన భామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు జాన్వీని ఆశీర్వదించి ఆమెకు బాబా మహకాళ్ ఫోటోను బహుకరించారు.
అయితే ఆలయానికి గులాబీ రంగు చీరలో వెళ్లిన జాన్వీ స్వామివారి హారతి పూజలో పాల్గొన్నారు. అయితే ఆలయానికి వెళ్లిన జాన్వీ పక్కనే.. తన ప్రియుడిగా భావిస్తున్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. దీంతో మరోసారి జాన్వీ కపూర్‌పై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే జాన్వీతో శిఖర్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment