బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌ చెక్‌ చేస్తానన్న జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Admits Checking Boyfriend Shikhar Pahariya Phone | Sakshi
Sakshi News home page

అబ్బాయిలు గర్ల్‌ఫ్రెండ్‌ ఫోన్‌ చెక్‌ చేయడం తప్పు.. నేను మాత్రం మావాడి ఫోన్‌ చూస్తా!

Published Fri, May 24 2024 4:01 PM | Last Updated on Fri, May 24 2024 4:30 PM

Janhvi Kapoor Admits Checking Boyfriend Shikhar Pahariya Phone

దివంగత నటి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతోంది ఆమె కూతురు జాన్వీ కపూర్‌. తెలుగులో దేవర సినిమా చేస్తున్న ఈ బ్యూటీ హిందీలో నటించిన మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ఇదివరకే ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. తాజాగా ఆమె తనకున్న ఓ చెడ్డ అలవాటును బయటపెట్టింది.

అమ్మాయిల ఫోన్‌ చెక్‌ చేయొద్దు
ఓ షోలో ఒక అమ్మాయి.. అమ్మాయిలు.. ప్రియుడి ఫోన్‌ చెక్‌ చేయొచ్చా? అని అడిగింది. అందుకు జాన్వీ.. అలా చేయొద్దంటారు కానీ నేనైతే చెక్‌ చేస్తాను అని చెప్పింది. మరి బాయ్స్‌ తన ప్రేయసి ఫోన్‌ చెక్‌ చేయొచ్చా? అని అడగ్గా.. నో, అలా చెక్‌ చేయకూడదు అని చెప్పింది. అదేంటి? మేమెందుకు మీ ఫోన్‌ చూడొద్దు అని ఓ అబ్బాయి అడగ్గా.. మీకు మా మీద ఆమాత్రం విశ్వాసం లేదా? అని సరదాగా మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లవ్‌ బర్డ్స్‌
కాగా జాన్వీ కపూర్‌, శిఖర్‌ పహారియా భగ్న ప్రేమికులు. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో అతడి పేరులోని అక్షరాలతో తయారుచేసిన నెక్లెస్‌ ధరించింది. తిరుపతికి సైతం ప్రియుడిని వెంటేసుకునే వెళ్తుంది. తనకు 16 ఏళ్ల వయసున్నప్పటి నుంచి శిఖర్‌ తనకు తోడుగా ఉన్నాడని, తాను కన్న కలలనే అతడి కలలుగా ఫీల్‌ అయ్యాడని.. అలాగే అతడి ఆశయాలను తన లక్ష్యాలుగా ఫీల్‌ అయ్యానని చెప్తూ ఉంటుందీ ముద్దుగుమ్మ. ఆ మధ్య జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ సైతం శిఖర్‌ తమ కుటుంబంలో ఎప్పటికీ ఉండాలని వారి బంధాన్ని చెప్పకనే చెప్పాడు.

 

 

చదవండి: పిల్లలు వద్దని కండీషన్‌ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: కవిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement