బాల్యంలోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది కవిత. అప్పటినుంచే యాక్టింగ్ ఆమెను అక్కున చేర్చుకుంది. సిరిసిరిమువ్వ సినిమాతో తెలుగులో తన ప్రయాణం మొదలైంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించింది.
ఎదురుకట్నం ఇచ్చి మరీ..
నా భర్త దశరథరాజ్ ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. నేను హీరోయిన్‌గా 60 రోజులు కష్టపడి సంపాదించేంత డబ్బును ఆయన ఒక్కరోజులో ఖర్చుపెట్టేస్తాడు. అలా అని నా డబ్బు అస్సలు ముట్టుకోడు. పెళ్లి(1983లో వివాహం జరిగింది)కి ముందు నా భర్తకు ఒక కండీషన్ పెట్టాను. నేను పిల్లల్ని కననని చెప్పాను. నేనేదో జోక్ చేస్తున్నా అనుకున్నారు.
పిల్లలు వద్దని..
పెళ్లయ్యాక మా అత్తగారేమో త్వరగా పిల్లలు కావాలని అడిగేది. నాకు పిల్లలు వద్దమ్మా అని అమ్మతో చెప్పాను. ఎందుకని అడగ్గా.. పుడితేనే కదా చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా అనేశాను. తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే బతికాను. అతడిని మర్చిపోలేకే అలా మాట్లాడాను. దీంతో అందరూ.. ఆ బాధ నుంచి బయటకు వచ్చేయమని సూచించారు.
పాప పుట్టాకే..
కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయ్యాను. రోజూ తమ్ముడి ఫోటో చూస్తూ ఏడ్చేదాన్ని. అది చూసి నా భర్త నన్ను వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాడు. పాప పుట్టాకే నా జీవితం సంతోషమయమైంది. మొత్తం నాకు ముగ్గురు సంతానం. కరోనా వల్ల భర్త, కుమారుడు కన్నుమూశారు అని కవిత కన్నీళ్లు పెట్టుకుంది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఫేక్ బేబీ బంప్ అంటూ ట్రోల్స్.. గట్టిగా బుద్ధి చెప్పనున్న హీరోయిన్!
Comments
Please login to add a commentAdd a comment