బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్తతో కలిసి ఓటేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లింది. ఆ సమయంలో బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో తను సరోగసి ఆప్షన్‌ను ఎంచుకుందన్న వార్తలకు చెక్ పడినట్లయింది.
అది నిజం కాదు
అయినప్పటికీ కొందరు మూర్ఖులు ఆమెను అనుమానిస్తూనే ఉన్నారు. తనది నిజమైన బేబీ బంప్ కాదని, అదంతా నాటకమని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆలియా భట్ సహా పలువురు సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా దీపికా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫ్యాన్స్‌ను అలర్ట్ చేసింది.
అప్పటివరకు వెయిట్..
మరికాసేపట్లో నేను లైవ్‌లోకి రాబోతున్నాను. అప్పటివరకు వెయిట్ చేయండి. ఓకే, బై అని రాసుకొచ్చింది. తన ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడబోతుందని అభిమానులు భావిస్తున్నారు. తనను ట్రోల్ చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. మరి దీపికా ఏ విషయం గురించి మాట్లాడనుందో చూడాలి! కాగా హీరో రణ్‌వీర్ సింగ్–దీపికా పదుకొణెలకు 2018 నవంబర్ 14న వివాహం అయింది. వివాహమైన ఆరేళ్లకు ఈ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు.
చదవండి:ఐదోసారి ఆ స్టార్ హీరో సినిమాలో నయనతార.. భారీ రెమ్యునరేషన్
Comments
Please login to add a commentAdd a comment