సౌత్ ఇండియాలో నయనతార జోరు మామూలుగా లేదుగా. నాలుగు పదుల వయసు.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. చేతి నిండా చిత్రాలు.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీ. ఇంకోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోవడం, ఇదీ లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుత పొజిషన్. ఇటీవల నయనతార నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవచ్చునేమోగానీ, ఆమె క్రేజ్, అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఈ భామ హిందీలో షారూక్‌ఖాన్ సరసన నటించిన జవాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడం, ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపు తట్టడమే.
ప్రస్తుతం నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం మన్నాంగట్టి సిన్స్ 1960 చిత్రాన్ని పూర్తి చేశారు. మరో పక్క మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న టెస్ట్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా హీరో అజిత్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అజిత్, నయనతారలది సూపర్‌హిట్ జంట అనే చెప్పాలి. వీరిద్దరూ ఇప్పటికి ఏగన్, బిల్లా, ఆరంభం, విశ్వాసం తదితర నాలుగు చిత్రాల్లో నటించారు. వీటిలో ఏగన్ చిత్రం మినహా మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.
తాజాగా ఈ జంట ఐదోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తరువాత ఆయన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌ను ఖారారు చేసిన విషయం తెలిసిందే. దీనికి సినీ వర్గాలు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఆయనకు జంటగా టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అలాంటిది తాజాగా ఈ వరుసలో లేడీ సూపర్‌స్టార్ నయనతార పేరు వినిపించడం విశేషం. అంతే కాదు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం జూన్ నెలలోనే సెట్‌పైకి వెళ్లనుందని, ఈ చిత్రం తొలి షెడ్యూల్‌లో నయనతార మూడు రోజులు పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రం కోసం ఈ భామ పారితోషకాన్ని ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇక ఆ చిత్రం కోసం నటుడు అజిత్ రూ.163 కోట్లు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చాలా కాస్టీలీ గురూ అంటున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment