స్టార్ హీరోయిన్ పెళ్లి అంటే హడావుడి మాములుగా ఉండదు. బ్యాచిలర్ పార్టీ, షాపింగ్, ప్రిపరేషన్.. ఇలా చాలా పనులతో బిజీగా ఉంటారు. అయితే కొందరు మాత్రం మ్యారేజ్ కి ముందు దేవుడు-పూజలు లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా అలానే కాకపోతే ఈమెకు తోడు కాబోయే భర్త కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి దైవభక్తిలో మునిగి తేలుతుండటం విశేషం.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?)
హీరోయిన్ పరిణితీ చోప్రా.. హిందీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి పేరు తెచ్చుకుంది. గతేడాది ఓ రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ.. ప్రస్తుతం మరో రెండు మూవీస్‌లో నటిస్తోంది. ఓవైపు నటిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మేలో ఆప్ పార్టీ నాయకుడు రాఘవ చద్దాతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కాలేజీ రోజుల నుంచే వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నప్పటికీ నిశ్చితార్థంతో వీళ్ల రిలేషన్ బయటపడింది.
ఎంగేజ్‌మెంట్ తర్వాత వీళ్ల పెళ్లి గురించి గాసిప్స్ వచ్చాయి. అయితే కొన్నిరోజుల ముందు మాత్రం తేదీ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 25న వెడ్డింగ్ జరగనుంది. దానికంటే ముందే పరిణితీ.. కాబోయే భర్త రాఘవ్ చద్దాతో కలిసి ఉజ్జయిని వెళ్లింది. మహంకాళేశ్వర స‍్వామి దర్శనం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. వాటిపై మీరు ఓ లుక్ వేసేయండి.
(ఇదీ చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా)
Wedding soon? #ParineetiChopra and #RaghavChadha offer prayers at Ujjain’s Mahakaleshwar Temple 🙏🏻 #Pinkvilla pic.twitter.com/kPPnyH10Gv
— Pinkvilla (@pinkvilla) August 26, 2023
आप सांसद राघव चड्ढा और उनकी मंगेतर, अभिनेत्री परिणीति चोपड़ा ने उज्जैन के महाकाल मंदिर में पूजा की 🙏🙏#raghavchadha #parineetichopra#mahakal pic.twitter.com/JPXsRGUxfg
— Jahnvi Sharma (@Jahnvish999) August 26, 2023
Comments
Please login to add a commentAdd a comment