‘అతి తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన వ్యక్తి పీవీ’ | Anand Mahindra Tweet On PV Narasimha Rao Viral | Sakshi
Sakshi News home page

‘అతి తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన వ్యక్తి పీవీ’

Published Mon, Jun 28 2021 1:01 PM | Last Updated on Mon, Jun 28 2021 1:04 PM

Anand Mahindra Tweet On PV Narasimha Rao Viral - Sakshi

సాక్షి, ముంబై: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాయకులు, ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర, పీవీని గుర్తు చేసుకుంటూ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. 91 నాటి ఆర్థిక సరళీకరణకు సంబంధించిన అందరు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి ఈ గౌరవం దక్కల్సింది పీవీ నరసింహరావుకు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆనంద్‌ మహీంద్ర సోమవారం ట్వీట్‌ చేశారు. 

దీనిలో ఆనంద్‌ మహీంద్ర టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో పీవీ మీద వచ్చిన కథనానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘‘నా సోమవారం మోటీవేషన్‌ తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన ఈ వ్యక్తిని గుర్తు చేసుకోవడంతో ప్రారంభమైంది. సాధారణంగా దేశ రూపురేఖలు మార్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలకు సంబంధించి అందరు మన్మోహన్‌ సింగ్‌ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి ఆ సంస్కరణలు ఆచరణలోకి రావడం వేనక పీవీ ధైర్యం, తెగువ ఉన్నాయి. కానీ ఆయనకు తక్కువ గుర్తింపు దక్కింది’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. 

చదవండి: పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం: సీఎం కేసీఆర్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement