సాక్షి, హైదరాబాద్: జన్మదినం రోజు ఓ ఫిర్యాదురాలికి సుల్తాన్‌బజార్ పోలీసులు వినూత్న బహుమతి ఇచ్చారు. వివరాలు.. జియాగూడకు చెందిన జి.భార్గవి పుట్టిన రోజు సందర్భంగా బొగ్గులకుంటలోని రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది.
టిఫిన్ చేసి బయటకు రావడంతో బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ బాలగంగిరెడ్డి సిబ్బందిని అలర్ట్ చేసి వెంటనే బైక్‌ను భార్గవికి అందజేశారు. దీంతో ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేక్‌కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొంది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. (క్లిక్ చేయండి: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment