sultan bazar police station
-
పోలీస్ స్టేషన్లో యువతి బర్త్ డే వేడుకలు.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జన్మదినం రోజు ఓ ఫిర్యాదురాలికి సుల్తాన్‌బజార్ పోలీసులు వినూత్న బహుమతి ఇచ్చారు. వివరాలు.. జియాగూడకు చెందిన జి.భార్గవి పుట్టిన రోజు సందర్భంగా బొగ్గులకుంటలోని రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది. టిఫిన్ చేసి బయటకు రావడంతో బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి సిబ్బందిని అలర్ట్ చేసి వెంటనే బైక్‌ను భార్గవికి అందజేశారు. దీంతో ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేక్‌కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొంది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. (క్లిక్ చేయండి: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం) -
‘విరాట పర్వం’ సినిమాను బ్యాన్ చేయాలి.. సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: విరాటపర్వం అనే సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై శ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చాలావరకు అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నందున సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని కోరారు. చదవండి: Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు -
హైదరాబాద్‌లో దారుణం.. కన్న తల్లిని కడతేర్చిన సైకో కొడుకు..
సాక్షి, హైదరాబాద్: వ్యాయమం చేయొద్దన్నందుకు కన్నతల్లిని మానసిక స్థితి సరిగా లేని ఓ కుమారుడు డంబెల్స్‌తో బాది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపిన మేరకు.. కామారెడ్డి జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన కొండ పాపమ్మ (45) రాంకోఠిలో ఓ అపార్టుమెంట్లో ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. కొండా సుధీర్ కుమార్ (25)కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లో తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో వ్యాయమం చేస్తుండడంతో తల్లి పాపమ్మ ఈ సమయంలో వ్యాయామం చేయొద్దని మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్‌కుమార్ డంబెల్స్‌తో తలపై తీవ్రంగా బాదాడు. అరుపులు విన్న చెల్లెలు సుచిత్ర తలుపులు బాదడంతో సుధీర్‌కుమార్ గడియ తీసి అమ్మను చంపేశానంటూ చెప్పాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి సుచిత్ర షాక్‌కు గురైంది. అంతటో ఆగని సుధీర్‌కుమార్ తన చెలెల్ని సైతం చంపేందుకు డంబెల్స్‌తో దాడి చేశాడు. దీంతో ఆమె గాయాలతో పరిగెత్తి స్థానికులకు చెప్పింది. స్థానికులు వచ్చేవరకు సుధీర్ తల్లితలపై డంబెల్స్పై బాదుతూనే ఉన్నడు. అప్పటికే ఆమె తల ఛిద్రమై పోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. పక్కనే ఉన్న ఓ కారును సైతం ధ్వంసం చేశాడు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకొని సుచిత్రను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాపమ్మ, మృతదేహాన్ని సైతం ఉస్మానియా మార్చురికి తరలించారు. నిందితుడిని ఎర్రగడ్డ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఎస్ఐ. శ్రీకాంత్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వారం రోజుల్లో విదేశాలకు.. కారం, కత్తి, ఐరన్ రాడ్‌తో కొట్టి.. -
మహిళతో అసభ్యకర సంభాషణలు.. ఎస్సై ట్రాన్స్ఫర్
హైదరాబాద్ : మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన షీ టీం ఎస్సైనే ఓ వివాహితపై వేధింపులకు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న పవన్‌కుమార్ ఎటాచ్‌మెంట్‌పై సీసీఎస్ ఆధీనంలోని షీ-టీంలో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన అంశాన్ని ఈయన పర్యవేక్షించారు. విచారణ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది సైతం మహిళేనని బయటపడింది. అలా ఆరోపణలు ఎదుర్కొన్న మహిళతో ఎస్సైకి పరిచయం ఏర్పడింది. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న పవన్‌కుమార్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్‌ల ద్వారా అభ్యంతరకరంగా సంభాషించాడు. ఈ విషయంపై సదరు మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ సంభాషణలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన అధికారులు ప్రాథమికంగా పవన్‌కుమార్‌ను సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. -
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
-
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. జూడాలు దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. దీంతో పోలీసుల ప్రయత్నాన్ని జూడాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జూడాలు, పోలీసుల మధ్య తీవ్ర తొపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ 50 మంది జూడాలను పోలీసులు అదుపులోకి తీసుకుని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.