హైదరాబాద్ : మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన షీ టీం ఎస్సైనే ఓ వివాహితపై వేధింపులకు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న పవన్‌కుమార్ ఎటాచ్‌మెంట్‌పై సీసీఎస్ ఆధీనంలోని షీ-టీంలో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన అంశాన్ని ఈయన పర్యవేక్షించారు. విచారణ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది సైతం మహిళేనని బయటపడింది.
అలా ఆరోపణలు ఎదుర్కొన్న మహిళతో ఎస్సైకి పరిచయం ఏర్పడింది. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న పవన్‌కుమార్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్‌ల ద్వారా అభ్యంతరకరంగా సంభాషించాడు. ఈ విషయంపై సదరు మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ సంభాషణలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన అధికారులు ప్రాథమికంగా పవన్‌కుమార్‌ను సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
మహిళతో అసభ్యకర సంభాషణలు.. ఎస్సై ట్రాన్స్‌ఫర్
Published Thu, Jun 9 2016 7:05 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM
Advertisement
Advertisement