హైదరాబాద్‌లో దారుణం.. కన్న తల్లిని కడతేర్చిన సైకో కొడుకు.. | Young Man Killed His Mother In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: ఎక్సర్‌సైజ్‌ చేస్తుండగా మందలించిన తల్లి.. ఇనుప రాడ్‌తో బలంగా కొట్టడంతో..

Published Mon, Jan 24 2022 12:19 PM | Last Updated on Tue, Jan 25 2022 8:32 AM

Young Man Killed His Mother In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వ్యాయమం చేయొద్దన్నందుకు కన్నతల్లిని మానసిక స్థితి సరిగా లేని ఓ కుమారుడు డంబెల్స్‌తో బాది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి తెలిపిన మేరకు.. కామారెడ్డి జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన కొండ పాపమ్మ (45) రాంకోఠిలో ఓ అపార్టుమెంట్‌లో ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. కొండా సుధీర్‌ కుమార్‌ (25)కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లో తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో వ్యాయమం చేస్తుండడంతో తల్లి పాపమ్మ ఈ సమయంలో వ్యాయామం చేయొద్దని మందలించింది.

దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్‌కుమార్‌ డంబెల్స్‌తో తలపై తీవ్రంగా బాదాడు. అరుపులు విన్న చెల్లెలు సుచిత్ర తలుపులు బాదడంతో సుధీర్‌కుమార్‌ గడియ తీసి అమ్మను చంపేశానంటూ చెప్పాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని  చూసి సుచిత్ర  షాక్‌కు గురైంది. అంతటో ఆగని సుధీర్‌కుమార్‌ తన చెలెల్ని సైతం చంపేందుకు డంబెల్స్‌తో దాడి చేశాడు. దీంతో ఆమె గాయాలతో పరిగెత్తి స్థానికులకు చెప్పింది. స్థానికులు వచ్చేవరకు  సుధీర్‌ తల్లితలపై డంబెల్స్‌పై బాదుతూనే ఉన్నడు. అప్పటికే ఆమె తల ఛిద్రమై పోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా దాడికి యత్నించాడు.

పక్కనే ఉన్న ఓ కారును సైతం ధ్వంసం చేశాడు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకొని సుచిత్రను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాపమ్మ, మృతదేహాన్ని సైతం ఉస్మానియా మార్చురికి తరలించారు.  నిందితుడిని ఎర్రగడ్డ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఎస్‌ఐ. శ్రీకాంత్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: వారం రోజుల్లో విదేశాలకు.. కారం, కత్తి, ఐరన్‌ రాడ్‌తో కొట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement