బర్త్‌డే: అభిమానులకు మహేష్‌ రిక్వెస్ట్‌ | Mahesh Babu Request To Fans: To Avoid Social Gathering On His Birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డే వేడుకలు: అభిమానులకు మహేష్‌ రిక్వెస్ట్‌

Published Fri, Aug 7 2020 10:56 AM | Last Updated on Fri, Aug 7 2020 12:05 PM

Mahesh Babu Request To Fans: To Avoid Social Gathering On His Birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఇంటూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు, అభిమానులకు పలు సూచనలు, సందేశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 9న(ఆదివారం) మహేష్‌ పుట్టిన రోజు. తాము ఆరాధించే హీరో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని అభిమానులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మహేష్‌ మరోసారి అభిమానులను కోరారు. తన బర్త్‌డే వేడుకలు నిర్వహించవద్దని.. అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. (మరోసారి తమిళదర్శకుడితో మహేష్‌బాబు!)

ఈ క్రమంలో ప్రిన్స్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ‘ప్రియమైన అభిమానులకు.. మీరు అందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా పుట్టిన రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తు ఉండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరిని నేను అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనం అందరం చేస్తున్న ఈ యుద్దంలో సురక్షితంగా ఉండటం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. ప్రేమతో మీ మహేష్..’ అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. (ఇంగ్లీష్‌ పాట‌కు ఇర‌గ‌దీసిన సితార‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement