Namrata Shirodkar: Mahesh Babu Wife Birthday Celebration, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar: అంతకు మించిన బెస్ట్‌ ఆప్షన్‌ ఇంకొకటి లేదు: మహేశ్‌ భార్య నమ్రత

Published Tue, Jan 25 2022 1:04 PM | Last Updated on Tue, Jan 25 2022 1:20 PM

Namrata Shirodkar Birthday Celebration Pic Goes Viral - Sakshi

Namrata Shirodkar's 50th Birthday Celebration Photo: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఆమె.. మహేశ్‌తో వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి కుటుంబ బాధ్యలతను నిర్వర్తిస్తోంది. మహేశ్‌ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటే.. అతని వ్యాపారాలతో పాటు పిల్లల బాధ్యతలను ఆమే చూసుకుంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది నమ్రత. తమ వ్యక్తిగత విషయాలతో పాటు మహేశ్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పకప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.  

ఇటీవల(జనవరి 22) నమ్రత పుట్టిన రోజు జరిగింది. తన బర్త్‌డేని కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది నమ్మత. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు’అంటూ నమ్రత కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక మహేశ్‌ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.  ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement