రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. బయట పెద్దగా కనిపించట్లేదు. మరోవైపు ఇతడి భార్య, కూతురు మాత్రం ఇప్పుడు ముంబైలో కనిపించారు. ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా కన్సర్ట్‌కి హాజరయ్యారు. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)
ప్రస్తుతం సితార టీనేజీ అమ్మాయి. అయితేనేం డ్యాన్సుల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఎత్తు, అందంలోనూ తల్లితండ్రులని మించిపోయేలా ఇప్పుడే కనిపిస్తోంది. చూస్తుంటే అందం విషయంలో మహేశ్‌ని మించిపోతుందేమోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అవుతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. అంతవరకు మహేశ్ అయితే పెద్దగా కనిపించడని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు అయితే ఎయిర్‌పోర్ట్ లేదా ఏదో ఓ ఈవెంట్‌లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముంబై కన్సర్ట్‌కి భార్య-కూతురిని మాత్రం పంపించాడు.
(ఇదీ చదవండి: కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?)
Comments
Please login to add a commentAdd a comment