పేద విద్యార్థి కలలకు ఊపిరి పోసిన సితార | Mahesh Babu Daughter Sitara Ghattamaneni Help To Poor Student For Better Future, Pics Goes Viral | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థి కలలకు ఊపిరి పోసిన సితార

Published Mon, Jul 22 2024 9:03 AM | Last Updated on Mon, Jul 22 2024 10:07 AM

Mahesh Babu Daughter Sitara Help To Student

పేదలకు చేతనైనంత సాయం చేయడంలో ఘట్టమనేని సితార ఎప్పుడూ ముందు ఉంటుంది. తండ్రి మహేశ్‌ బాబు అడుగుజాడల్లో సితార కూడా పేదలకు అనేకసార్లు సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంది. సితా వయసులో చిన్నదే అయినా.. తన మనసు మాత్రం చాలా విశాలమైనది అంటూ నెటిజన్లు కూడా ఎప్పుడూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్‌ చదవాలనుకున్న పేద విద్యార్థికి సాయం చేసి అండగా నిలిచింది.

ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్‌ తన ఇన్‌స్టా ద్వారా ఇలా పంచుకున్నారు. 'దినసరి కూలీ తన కూతురు నవ్యను చదివించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాడు. ఆమె కూడా NEET పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది. ఆమె డాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.. తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది. అయితే, ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలిచింది. 

దీంతో మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా నవ్యశ్రీకి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మెడికల్ విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు కాలేజీ, హాస్టల్‌ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తోంది. మా లిటిల్ ప్రిన్సెస్ (సితార) తన పుట్టినరోజును కూడా నవ్యతో జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెను అభినందించడంతో పాటు కాబోయే డాక్టర్‌కు ల్యాప్‌టాప్, స్టెతస్కోప్‌ను బహుమతిగా ఇచ్చింది.' అని నమ్రత తెలిపింది.

2024లో జరిగిన నీట్‌ పరిక్షలో నవ్య 605 మార్కులు సాధించింది. సాధారణ కళాశాలలో చదవి తన ప్రతిభతో టాప్‌ స్కోర్‌ సాధించి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీట్‌ సాధించింది. కానీ, పుస్తకాలు, హాస్టల్‌ ఫీజు, కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లిచలేని స్థితిలో నవ్య కుటుంబం ఉంది. దీంతో మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను నవ్య సంప్రదించింది. 

ఆమె కలలకు మహేష్ బాబు ఫౌండేషన్ ఊపిరి పోసింది. రూ. 1,25,000 చెక్కుతో పాటు తన మెడిసిన్‌ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచే డబ్బు అందుతుందని ఘట్టమనేని కుటుంబం భరోసా కల్పించింది. సితార పుట్టినరోజును ఆమెతో జరుపుకోవడం మహేశ్‌ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement