పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జుట్టుకు దట్టంగా నిండుకున్న స్ప్రే నురగలకు క్రాకర్ క్యాండిల్ నిప్పు అంటుకోవటంతో ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. యువకుడి బర్త్‌డే వేడుకలు జరపటానికి స్కూటిపై కేకును ఉంచి దానిపై క్రాకర్ ఫైర్ క్యాండిల్‌ను వెలిగించారు. బర్త్‌డే బాయ్ చుట్టూ ఉన్న వాళ్లు కేరింతలు కొడుతూ అతడిపై స్నో స్ప్రే కొట్టడం ప్రారంభించారు. క్షణాల్లో అతడి తలమొత్తం నురగలతో నిండిపోయింది. కొద్దిసేపటి తర్వాత స్ప్రేల నుంచి తప్పించుకోవటానికి మెల్లగా తలక్రిందకు దించటంతో క్రాకర్ క్యాండిల్ నిప్పు తలకు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.