![Samrajyamma Completes 103 Years Warangal Rural District - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/7/Samrajyamma.jpg.webp?itok=OEu1tzh0)
సంగెం : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లికి చెందిన కొరిటాల సామ్రాజ్యమ్మ ఆదివారం 103వ జన్మదిన వేడుకలను జరపుకుంది. సామ్రాజ్యమ్మ భర్త రామకిష్టయ్య వంద ఏళ్లు జీవించి నాలుగేళ్ల క్రితం మరణించారు. 103 సంవత్సరాల వయసు ఉన్నా సామ్రాజ్యమ్మ నేటికీ తన పనులన్నీ స్వయంగా చేసుకోవడంతో పాటు వంట కూడా చేసుకుంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉండగా.. మొత్తం 50 మంది మనమలు, మనమరాళ్లు, ముని మనమలు, మనమరాళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు రామారావు, ముగ్గురు కుమార్తెలు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment