warangal rural district
-
ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!
సాక్షి, దుగ్గొండి(వరంగల్): గ్రామాలలో గొర్రెలు చనిపోతే వాటిని మాంసం కోసం విక్రయించడం చేయవద్దని వాటిని గొయ్యి తీసి పాతిపెట్టాలని అధికారులు తెలిపారు. చనిపోయిన గొర్రెల శరీరాన్ని ఓపెన్ చేసి మాంసాన్ని విక్రయించడం వల్ల బ్యాక్టీరియా మనుషులకు చేరి అనారోగ్యం పాలవుతారని తెలిపారు. వరంగల్ జిల్లా చాపలబండా గ్రామంలోని గొర్రెల మందలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు మృత్యువాతపడిన విషయం విధితమే. వరంగల్ చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు చనిపోయిన నేపథ్యంలో మాసం కొనేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంత్రాక్స్ వ్యాధి సోకిన మేకలు, గొర్రెల మాంసాన్ని తాకడం, తినడం, కొనడం చేయవద్దన్నారు. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! మేక/గొర్రెను కోసినప్పుడు వచ్చే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలన్నారు. అలాగే కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలని సూచించారు. చనిపోయి ఉన్న మూడు గొర్రెలను వెంటనే పాతిపెట్టాలన్నారు. అవి చనిపోయిన ప్రదేశంలో పడిన రక్తంపై ఎండు గడ్డివేసి మంట పెట్టాలని సూచించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. అధైర్య పడవద్దని ఆంత్రాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే ఆంత్రాక్స్‌తో చనిపోయిన గొర్రెలు ఉన్న మందను ఊరికి దూరంగా ఉంచాలన్నారు. కాపరులు గొర్రెలకు కొంత దూరంగా ఉండి మేపాలన్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! అజాగ్రత్తగా ఉంటే మనుషులకు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామంలో మిగిలిన 1200 గొర్రెలకు వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని స్థానిక వైద్యాధికారి శారదకు సూచించారు. చాపలబండలో ఐదేళ్ల పాటు ప్రతి 9 నెలలకోసారి గొర్రెలు, మేకలకు ఆంత్రాక్స్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. గొర్రెలన్నింటిని కొన్ని రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
సైకో భర్త ఘాతుకం.. ఇద్దరు భార్యలను..
సాక్షి, పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లుకు చెందిన వ్యక్తి తొలుత ఒక మహిళను పెళ్లి చేసుకుని హత్య చేశాడు. ఆ తర్వాత మరొక మహిళను పెళ్లాడి ఆమెను కూడా చంపేశాడు. రెండో భార్య కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో.. మొదటి భార్యను ఆరేళ్ల క్రితం హత్య చేసిన విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొదట ప్రేమించానంటూ.. ఏనుగల్లుకు చెందిన కర్నె కిరణ్ మొదట రైల్వేస్టేషన్లో ఒక మహిళను చూసి ప్రేమించానంటూ వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెను తరచూ వేధించడంతో పాటు పలుమార్లు కొట్టి గాయపర్చడంతో ఆరేళ్ల క్రితం మృతి చెందింది. ఈ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. రెండేళ్ల క్రితం రెండో పెళ్లి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌కు చెందిన ఓడపల్లి అంజలీ బాయి (43)ని 2019లో కిరణ్ పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆమె ఇంటి వద్దే ఉండి, ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు వచ్చాడు. అప్పట్నుంచీ ఇళ్లు అమ్మి డబ్బు తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలోనే ఈనెల 13వ తేదీన తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14వ తేదీన మరణించింది. దీంతో పోలీసులు కిరణ్‌ను విచారించారు. ఈ క్రమంలో మొదటి భార్యను కూడా హత్య చేశానని, ఆమె శవాన్ని తాను ఉండే ఇంటి ఆవరణలోనే పాతిపెట్టానని వెల్లడించాడు. దీంతో పోలీసులు ఆదివారం మృతదేహాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. సైకో చేష్టలతో ఎర్రగడ్డలో చికిత్స నిందితుడు కిరణ్ వ్యవహార శైలి కారణం గా తల్లిదండ్రులు అతనికి వివాహం చేయకుం డా వదిలేశారు. దీంతో అక్కడక్కడా తిరుగు తూ తొలుత ఎవరూ లేని అనాథకు వల వేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేసి చంపేశాడు. ఆమె అనాథ కావడంతో దీనిపై ఎలాంటి ఫిర్యా దు నమోదు కాలేదు. గతంలో ఓసారి కిరణ్ వ్యవహార శైలి తెలుసుకున్న అప్పటి పర్వతగిరి ఎస్సై రమేష్‌నాయక్ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలిం చి చికిత్స చేయించినా తప్పించుకువచ్చాడు. గ్రామంలో ఉంటే మళ్లీ పోలీసులు వస్తారని భావించి వరంగల్‌లో ఉంటూ హుజూరాబాద్‌లో నర్సుగా పనిచేసే మహిళను రెండో వివాహం చేసుకుని ఆమె ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు మకాం మార్చి, వేధింపులకు గురిచేసి చంపేశాడు. ఈ ఘటనపై అంజలీబాయి తల్లి ఓడపల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేష్కుమార్ శనివారం తెలిపారు. -
ఆ గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసూ లేదు
గీసుకొండ: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామం కోవిడ్ నియంత్ర ణలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రస్తుతం గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. ఇక మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించగా సర్పంచ్ అల్లం బాలిరెడ్డి చొరవ తీసుకుని 150 మందిని గీసుకొండ పీహెచ్‌సీకి ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి టీకా వేయించారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తుండటంతో గురువారం నాటికి 164 మందికి టీకా వేయించారు. ఈ ఊరి మొత్తం జనా భా 750కాగా, గ్రామంలో 45 ఏళ్లు పైబడిన మొత్తం 314 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లయింది. చదవండి: వ్యాక్సిన్ కోసం తరలొస్తున్నారు.. -
తెలంగాణ అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి
సాక్షి, జవహర్‌నగర్: వారి ప్రేమకు ప్రాంతాలు, దేశాలు అడ్డురాలేదు. ఆ జంట జాతి, కులం, మతం, వర్గం, ప్రాంతం అనేది చూడలేదు. ఇద్దరి మనసులు కలవడంతో కుటుంబ పెద్దలను ఒప్పించారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలోని పాపయ్యపేటకు చెందిన కంచ కృష్ణకాంత్ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ నిమిత్తం 2002లో లండన్ వెళ్లారు. అక్కడ పోలాండ్‌కు చెందిన బార్బర అనే యువతిని ప్రేమించారు. వీరిద్దరూ 2010లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పదేళ్ల ఆరన్, అయిదేళ్ల నేతన్ ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కృష్ణకాంత్ సోదరుడు నరేష్ ప్రేమ వివాహం చేసుకుని లండన్ సిటిజన్‌షిప్ (బ్రిటన్ పౌరసత్వం) తీసుకుని అక్కడే నివాసముంటున్నారు. ఆదివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లండన్‌లోని కృష్ణకాంత్, బార్బర దంపతులను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రేమించడమే కాదు, పెద్దలను మెప్పించాలి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎవరికీ ఇబ్బందులు ఉండవు అని పేర్కొన్నారు. చదవండి: బెబ్బులి మళ్లీ వచ్చింది..! ‘పోడు’ రగడ.. బావిలో దూకిన మహిళ -
చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు
సాక్షి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం సద్దుమణగడం లేదు. కొన్ని కులాల ఉద్యోగులపై ఆయన వాడిన పదాలు మంటలు రేపుతున్నాయి. ఓసీ జేఏసీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటుండగా, నిన్నటి వరకు ఉమ్మడి వరంగల్‌కే పరిమితమైన ఆందోళనలు బుధవారం తెలంగాణలోని పలు జిల్లాలను తాకాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లగా, బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు పరకాల బంద్ ప్రశాంతంగా జరిగింది. కాగా, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల బాధ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మారెడ్డి క్షమాపణ) శాంతించని సంఘాలు వరుస వివాదాలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు వేదికలుగా మారాయి. పరకాలలో జరిగిన ఓ సమావేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరిట నిధుల సేకరణకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తొలుత వివాదాస్పదమయ్యాయి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, విరాళాలు సేకరిస్తున్న నేతలే జేబులు నింపుకుంటున్నారని అన్నారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ నేతలు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడులు, ప్రతిదాడులతో వరంగల్ నగరం అట్టుడికిపోగా, హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ మహాగర్జన సభలోనూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరో వివాదానికి తెరలేపారు. ‘ఆ కులాల అధికారులకు అక్షరం ముక్క రాదు’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారు, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోంది’ అనడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆందోళనలకు దిగారు. ‘సారీ’తో ఆగని ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ‘ఆ సమావేశంలో నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, ఆ మాటలు ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నా’ అని అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దీంతో వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. కానీ తమ మనోభావాలకు సంబంధించిన అంశంగా భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల, ఉద్యోగసంఘాలు ఆందోళనలను కొనసాగిçస్తున్నాయి. కాగా, రామమందిరం నిర్మాణంపై వ్యాఖ్యల వివాదం సమయంలో స్పందించిన టీఆర్ఎస్ వర్గాలు ఈ విషయంలో స్తబ్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా బీసీ, దళిత వర్గాల ఉద్యోగులను అవమానపరిచేలా పరకాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయంటూ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. -
మృత్యుపాశాలు; ఆరేళ్లలో 3 వేల మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో 3 వేల మందిపైగా విద్యుదాఘాతాలకు బలైపోయారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో 2014-2020 మధ్య కాలంలో విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడి 3,008 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 1,197 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందడం గమనార్హం. తెలంగాణ ఉత్తర విభాగం విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడించింది. (వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ) విద్యుత్ ప్రమాదాల బారిన పడిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయం పరిహారం చెల్లించాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(టీఎస్ఈఆర్సీ) స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది, అధికారుల నిర్లక్క్ష్యంతో తరుచుగా ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తీగలను సరిగా అతికించకపోవడం, లైవ్ వైర్లు, స్తంభాల నుంచి లీకేజీ, విద్యుత్ సరఫరాలోని లోపాల కారణంగా విద్యుత్దాఘాతాలు సంభవిస్తున్నాయి. కరెంట్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేసే ముందు అవసరమైతే అంతర్గత విచారణ చేపట్టవచ్చని డిస్కంలకు టీఎస్ఈఆర్సీ సూచించింది. 2013 వరకు 2 లక్షలుగా ఉన్న పరిహారాన్ని 2015లో నాలుగు లక్షలకు ప్రభుత్వం పెంచింది. పలు సవరణల తర్వాత 2018లో పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మృతుల్లో చాలా మంది సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కావడంతో పరిహారాన్ని పొందడంలో వారి కుటుంబ సభ్యులు అవాంతరాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. పరిహారం కోసం చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నాయని సామాజిక కార్యకర్త సుధీర్ జలగం తెలిపారు. ఆర్టీఐ కింద విద్యుత్ ప్రమాద వివరాలను ఆయన సేకరించారు. ‘బాధితుల కుటుంబాలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర రుజువులను అందించాల్సిన అవసరం ఉంది, కాని అధికారులు వాటిని జారీ చేయడానికి నెలల సమయం తీసుకుంటూ, ప్రక్రియను ఆలస్యం చేస్తున్నార’ని ఆయన ఆరోపించారు. డిస్కంలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయని, తరచుగా తనిఖీలు నిర్వహించడం లేదని తెలిపారు. (మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు) టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 2014-2020 మధ్య కాలంలో వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 178 విద్యుత్ ప్రమాద సంబంధిత మరణాలు సంభవించాయి. తర్వాత స్థానాల్లో కామారెడ్డి(175), నిర్మల్(164), మహబూబాబాద్(163), జగిత్యాల్(160), నిజామాబాద్(158), పెద్దపల్లి(139), కరీంనగర్(130), మంచిర్యాల(129), ఆదిలాబాద్(128), ఖమ్మం(128), భూపాలపల్లి(122), భదాద్రి-కొత్తగూడెం(119), జనగాం(113), వరంగల్ అర్బన్(60), ఆసిఫాబాద్(53) ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు అమలు చేసి ఉంటే ఈ మరణాలు సంభవించేవి కాదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి. సాగర్ అన్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్క్ష్యం కారణంగానే రైతులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు తప్ప ముందుస్తు రక్షణ చర్యలు శూన్యమని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో గత కొనేళ్లుగా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2014-15లో 210 మరణాలు నమోదు కాగా, 2017-18లో 537 మంది మృతి చెందారు. 2019-20 నాటికి ఈ సంఖ్య 681కి పెరగడం ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తోంది. -
ప్రాణాలతో వుండగానే బావిలో...
-
గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...
సాక్షి ప్రతినిధి, వరంగల్: తీవ్ర కలకలం రేపిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై అసలేం జరిగిందనే దానిపై కేంద్ర హోం శాఖ శనివారం ఆరా తీసినట్లు సమాచారం. వ్యవసాయ బావిలో తొమ్మిది మృతదేహాలు తేలిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు శనివారం గొర్రెకుంటలోని బావిని పరిశీలించారు. కాగా, తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు. వాళ్లంతట వాళ్లే కావాలని బావిలోకి దూకారా.. లేదంటే మత్తు, విషం లాంటిది ప్రయోగించి బతికి ఉండగానే బావిలో పడేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) పోలీసుల అదుపులో ముగ్గురు.. ఈ కేసులో మూడు రోజులు గడిచినా పురోగతి లేదు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసు ప్రత్యేక బృందాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు బావిలో శవమై తేలిన బుష్రా ఖాతూన్ ప్రియుడు యాకూబ్ కాగా, మరో ఇద్దరు బిహార్‌కు చెందిన కార్మికులు. యాకూబ్‌ను శుక్రవారమే అదుపులోకి తీసుకోగా, శనివారం సంజయ్ కుమార్ యాదవ్, మంకుషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు రెండు సెల్ఫోన్లు దొరికినట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి మక్సూద్‌ది కాగా, మరొకటి బుష్రా ఖాతూన్‌దిగా చెబుతున్నారు. ఆ రెండు ఫోన్ల కాల్‌డేటా వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. (చనిపోయారా.. చంపేశారా?) గొర్రెకుంటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ ముగ్గురు ఆనుమానితులు అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు, శనివారం ఉదయం గొర్రెకుంటలోని బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్ యాదవ్, మంకుషాను సంఘటన వద్దకు తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. మొదటి అంతస్తులోని మరణించిన ఇద్దరు బిహారీల గదిని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. బంగ్లా మీది నుంచి ఎవరైనా బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. (గీసుకొండ ఘటనపై పలు అనుమానాలు) పకడ్బందీగా దర్యాప్తు చేయండి: హోంమంత్రి వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్ పొలీసు కమిషనర్ వి.రవీందర్‌ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సెల్‌ఫోన్ సంభాషణలే కీలకం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల వారంతా చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ రజామాలిక్ పేర్కొన్నారు. బావిలోనే తుది శ్వాస విడిచారని, అయినా వారి విస్రాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, వారిపై ఫుడ్ పాయిజన్ జరిగిందా.. లేదా అనేది తేలాలంటే ఫోరెన్సిక్ నివేదిక రావాలని తెలిపారు. నలుగురు మృతుల ఒంటిపై గాయాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసుల పరిశోధనకు సెల్‌ఫోన్ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. బుష్రా ఖాతూన్, ఆమెతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తో పాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో వాటి కోసం గాలిస్తున్నారు. మార్చురీలోనే మృతదేహాలు తొమ్మిది మృతదేహాలు కూడా శనివారం రాత్రి వరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరిచారు. శనివారం ఉదయం మృతదేహాలను ఖననం చేస్తారని భావించారు. కానీ మక్సూద్ బంధుమిత్రులు పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నారనే సమాచారంతో మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, కేసు ఓ కొలిక్కి వచ్చేవరకు మృతదేహాలను భద్రపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం
-
‘పౌర’ సవరణ లౌకికవాదానికి చేటు
సాక్షి, వరంగల్: పౌరసత్వ చట్ట సవరణ దేశ లౌకికవాదానికి చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలోని మతతత్వ బీజేపీ చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టంతో లౌకిక దేశంగా పేరుగాంచిన భారత్‌కు ఇక మీదట ఆ పిలుపు దూరం కానుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో అంతరాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 19న కమ్యూనిస్టుల పిలుపుతో నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై చిత్తశుద్ధి కనబర్చడం లేదని ఆరోపించారు. జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా కేసీఆర్ ఎన్నిక హామీలు అమలవుతున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మత్తులో యువత చెడు సావాసలకు పాల్పడుతోందని అన్నారు. రాష్ట్ర మద్యపాన నిషేధం కోసం మహిళలు, మహిళా సంఘాలతో ఈ నెల 23న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయ ముట్టడి చేపడుతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్రజావ్యతిరేక విధానాలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు ప్రజారంజక పాలన కొనసాగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలు ఉద్యమబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. విజయసారథి, జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎం. సదాలక్ష్మీ, వీరస్వామి, అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, శంకరయ్య, సుంకరనేని నర్సయ్య, శ్రీనివాస్, ఆరెల్లి రవి పాల్గొన్నారు. -
రాములో .. రాములా సౌత్ ఇండియా రికార్డ్
సాక్షి, వరంగల్ :‘నాటక రంగం నుంచి రచనా రంగంలోకి వచ్చాను.. మా నాన్న స్టేజీ ఆర్టిస్ట్.. నా చదువు ఎక్కువగా వరంగల్‌లోనే సాగింది.. చిన్నప్పటి నుంచి నాటకాలు, రచనలు అంటే చాలా ఇష్టం.. అదే మక్కువతో రచయితగా మారాను. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నేను రాసిన రాములో... రాముల పాటకు ప్రశంసలు దక్కాయి...’ అంటున్నారు సినీ గేయ రచయిత కాసర్ల శ్యాం! వరంగల్‌కు బుధవారం వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించగా తన సినీ ప్రస్థానాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.... మాది హన్మకొండ నేను పుట్టి పెరిగింది అంతా వరంగల్‌లోనే. హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన మా నాన్న గారు మధుసూదన్‌రావు రంగస్థల నటులు. అప్పట్లో మా నాన్న కూడా పలు చిత్రాల్లో నటించారు. దీంతో ఆయనను హన్మకొండ శోభన్‌బాబు అని పిలిచేవారు. దీంతో చిన్నతనం నుంచే నాకు కూడా సాహిత్యం ఇష్టం ఏర్పడింది. క్షీర సాగరమధురం, నటరాజు నవ్వాలి వంటి నాటకాల్లో చిన్నప్పుడే పాత్రలు పోషించాను. జానపదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వరంగల్ శంకర్, సారంగపాణి తమ బృందాల్లో నాకు అవకాశం ఇచ్చారు. తొలుత నాటకరంగంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం, జానపద గేయ రచయితగా, గాయకుడిగా అనేక మలుపులు తిరిగింది. నేను రాసిన, పాడిన పాటల్లో చాలా వరకు ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి. చదివింది ఇక్కడే.. హన్మకొండలోని మచిలీబజార్‌లోని ప్రగతి స్కూల్లో 10వ తరగతి వరకు, ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్, యూనివర్సిటీలో చదువుకున్నాను. చదువుకునే రోజుల్లో జ్యోతి కల్చరల్ ఆర్ట్స్‌ను ప్రారంభించి 13 నృత్య నాటికలు రాయడంతో పాటు సమాచార శాఖ ఆధ్వర్యాన ప్రదర్శనలు ఇచ్చాను. వరంగల్ శంకరన్న, సారంగపాణి, మా ఇంట్లో వారి ప్రోత్సాహంతో హైదారాబాద్ వెళ్లాను. అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్ ఆర్ట్స్‌లో చేరాక ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించా. రాములో .. రాములా సౌత్ ఇండియా రికార్డ్ త్రివిక్రమ్ దర్శకత్వంతో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో రాములో... రాములా పాట రాశాను. సౌత్ ఇండియాలోనే 24గంటల్లో 8.3 మిలియన్ మంది వీక్షకులు ఈ పాటను యూ ట్యూబ్‌లో వీక్షించారు. 20 రోజుల్లో 50 మిలియన్ మంది వీక్షించారు. ప్రముఖ హీరో వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న వెంకీ మామ, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే, నితిన్ నటిస్తున్న భీష్మ ఇలా పలు సినిమాల్లోనూ పాటలు రాశాను. ఇక బస్ స్టాప్ సినిమాలోని కలలు.. పాటకు 2012లో సంతోషం అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ వారు సినారే అవార్డు, తెలుగు రచయితల అసోసియేషన్ నుంచి విశిష్ట రచన పురస్కారం, సింగిడి అవార్డులు దక్కాయి. ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా 2003 సంవత్సరంలో దర్శకురాలు బి.జయ తన చంటిగాడు సినిమాలో అవకాశవిుచ్చారు. ఆ సినిమాలో ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా. ఆ తర్వాత ఏడేళ్లలో ఏడు చిత్రాలకు మాత్రమే పని చేశా. ఓ పక్క ఎంఫిల్... మరోపక్క పాటలు... కష్టమైంది. కృష్ణవంశీ మహాత్మాలో నీలపురి గాజులు... పాటతో బ్రేక్ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలోని రింగ్ ట్రింగ్ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేవిశ్రీప్రసాద్‌తో వర్క్ చేయాలనుకున్న కోరిక ఎఫ్2 సినిమాలోని రెచ్చిపోదాం బ్రదర్ పాట ద్వారా తీరింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో దిమాక్ కరాబ్ నే పాట కూడా మంచి పేరు తీసుకొచి్చంది. ఇప్పటికి 150కు పైగా చిత్రాల్లో 350కు పైగా పాటలు రాశాను. వరంగల్‌కు మంచి గుర్తింపు వరంగల్‌కు చెందిన వారే ప్రస్తుతం ఎక్కువగా సినిమా రంగంలో రాణిస్తున్నారు. పెద్ద డైరెక్టర్లు, మంచి టెక్నీషియన్లు, సంగీత దర్శకులు, గేయ రచయితలు ఎందరో వరంగల్ వారే ఉన్నారు. ఇక్కడ రామప్ప, ఖిలా వరంగల్, లక్నవరం, భద్రకాళి దేవాలయం ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కాగా, సినిమా రంగంలో కొత్తగా వచ్చే వారికి అతి విశ్వాసం ఉండొద్దు. కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుంది. అవకాశాలు రావడం లేదు కదా అని నిరాశకు లోనైతే ఇబ్బందులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం వరిస్తుంది. -
కండక్టర్ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో గందరగోళం చోటుచేసుకుంది. అంతిమయాత్రను త్వరగా ముగించాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. కుటుంబ సభ్యులు, అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన పోలీసు కమిషనర్ మధు ఆర్టీసీ కార్మికులపై చేయి చేకున్నారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతిమయాత్రను ఆపి.. రవీందర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె -
వృద్ధ దంపతుల సజీవ దహనం
సాక్షి, నెక్కొండ: ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్య ధస్రు(68), బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యారు. ఈ క్రమంలో వారు నివసిస్తున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటై ఈ దసరాతో మూడేళ్లవుతున్నా.. జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టరేట్ సముదాయాలు చివరి దశలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రూరల్ జిల్లా కేంద్రం ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. -
సామ్రాజ్యమ్మ @103 ఏళ్లు
సంగెం : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లికి చెందిన కొరిటాల సామ్రాజ్యమ్మ ఆదివారం 103వ జన్మదిన వేడుకలను జరపుకుంది. సామ్రాజ్యమ్మ భర్త రామకిష్టయ్య వంద ఏళ్లు జీవించి నాలుగేళ్ల క్రితం మరణించారు. 103 సంవత్సరాల వయసు ఉన్నా సామ్రాజ్యమ్మ నేటికీ తన పనులన్నీ స్వయంగా చేసుకోవడంతో పాటు వంట కూడా చేసుకుంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉండగా.. మొత్తం 50 మంది మనమలు, మనమరాళ్లు, ముని మనమలు, మనమరాళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు రామారావు, ముగ్గురు కుమార్తెలు చనిపోయారు. -
సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు
సాక్షి, పరకాల: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి వ్యక్తులు ఉన్నా లేకున్నా సరైన సిస్టం (వ్యవస్థ)ఉండాలని అప్పుడే సమస్యలు దూరమవుతాయని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కమిటీల ద్వారా నిరంతరం సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం సందర్శించి సర్పంచ్ అల్లం బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు, పలు కమిటీల సభ్యులతో ఆమె గ్రామంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మోరీలు శుభ్రంచేశారా.. లైట్లు వెలుగుతున్నాయా.. ఇంకా ఇతర పనులు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పనులు చేపట్టడానికి కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్ బాలిరెడ్డితో పాటు స్థానికుల కృషితో గ్రామం చాలా నీట్‌గా పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. పండుగ వాతావరణం నెలకొందని, రాత్రి పూట సమావేశం ఏర్పాటు చేస్తే చీకటిలో కూర్చున్నా ఒక్క దోమ కూడా ఎవరినీ కుట్టకపోవడం విశేషం అని అభినందించారు. దీంతో గ్రామం ఎంత శుభ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. సీఎం కేసీఆర్‌ను గ్రామానికి తీసుకుని వస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని, ఎలాగైనా వచ్చేలా చూడాలని సర్పంచ్ బాలిరెడ్డి కోరగా గ్రామం సాధించిన ప్రగతి గురించి సీఎంకు వివరిస్తానని ఆమె తెలిపారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, బడ్జెట్ గురించి సర్పంచ్ బాలిరెడ్డితో పాటు కమిటీల సభ్యులు తిరుమల్‌రెడ్డి దిలీప్‌రెడ్డి, ఆడెపు రాంనాధం, అల్లం చిన్నపురెడ్డి, బిట్ల నాగరాజు, పులిశేరి మంజుల, అద్దాల లలిత, శేషు ఆమెకు తెలిపారు. సర్పంచ్ కృషి, పట్టుదల, అంకితభావంతోనే గ్రామం ప్రగతి వైపు పరుగులు తీస్తోందని గ్రామస్తులు స్మితా సబర్వాల్‌కు వివరించారు. వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ముండ్రాతి హరిత, ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అనితా రాంచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాజేశ్‌చౌహాన్, డీపీఓ నారాయణరావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీఎల్పీవో స్వరూప, ఎంపీపీ బీమగాని సౌజన్య, జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ శేషాంజన్‌స్వామి, ఏపీఓ మోహన్‌రావు, ఏపీఎం సురేశ్‌కుమార్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, ఎంపీటీసీ వీరారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పలు కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిరంతరం ఇదేస్పూర్తిని కొనసాగించాలి ధర్మసాగర్: 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమం పనుల ద్వారా గ్రామంలో మార్పు కనిపిస్తుందని నిరంతరం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని స్మితా సబర్వాల్ అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, ఉపసర్పంచ్ బొడ్డు అరుణ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం స్మితా సబర్వాల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామపంచాయతీ వారు తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలను గ్రామస్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు సహకరిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, జెడ్పీసీఈఓ ప్రసూనరాణి, ఎంపీడీఓ జి.జవహర్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీపీ నిమ్మ కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల శ్రీలత, ఎంపీటీసీ సభ్యులు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దత్తతకు చట్టబద్ధత కరువు..
ఆడపిల్లే ఇంటికి దీపం.. ఇంటి మహాలక్ష్మీ.. ఓపిక, సహనం.. సాహసానికి ప్రతిరూపం.. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పై చేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న సమయంలో అక్కడక్కడా ఆడపిల్లను అంగడిలో సరుకును చేస్తున్న సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఆడ పిల్లలు భారం కావద్దని భవిష్యత్‌కు ఆధారం కావాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొంత మంది డబ్బులకు ఆశపడి అమ్మకానికి, అక్రమ దత్తతలకు ఇస్తున్నారు. దత్తతను ఇస్తున్నట్లు నాన్ జ్యుడీషియల్ పేపర్ల మీద రాసుకుని ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల నర్సంపేటలోని లక్నెపల్లిలో జరిగిన సంఘటనే ఉదాహరణ.. సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. దీంతో దుగ్గొండి మండలం మహ్మదాపురంకు చెందిన దంపతులకు ఆడపిల్లను దత్తత ఇచ్చారు. ఈ దత్తత తీసుకున్న దంపతులకు వివాహమై 15 సంవత్సరాలవుతోంది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో దత్తతను తీసుకుంటున్నామని, దత్తత తీసుకున్న దంపతులు ఆ పాప పేరు మీద ఇల్లు, 0.20గుంటల పొలాన్ని రాసిచ్చారు. దత్తతను ఇచ్చిన వారు ఎక్కడా తమ పాప అని చెప్పవద్దని నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పేపర్‌పై దత్తత పత్రం రాసుకుని సెప్టెంబర్ 19న దత్తతను తీసుకున్నారు. ఈ దత్తత విషయం ఈ నోట ఆ నోట పడి ఈ నెల 1న జిల్లా చైల్ట్ వైల్ఫేర్ అధికారులకు చేరింది. దీంతో చుట్టు పక్కల వారిని విచారించగా నిజమేనని తెలింది. దత్తత ఇచ్చిన పాపను తీసుకుని శనివారం చైల్డ్ వేల్ఫెర్ కమిటీ ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 127 మంది దత్తత.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారా ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు 127 మందిని దంపతులు దత్తత తీసుకున్నారు. అందులో అబ్బాయిలు 30 మంది, అమ్మాయిలు 97 మందిని తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆడ శిశువుల విక్రయాలు సాగుతున్నాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో బయటకు వస్తున్నాయి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తల్లితండ్రులు బాలికలమీద అదే వివక్ష కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్యా అందిస్తున్న సైతం శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. దత్తత ఇలా తీసుకోవాలి పిల్లలు లేని దంపతులు తమ బంధువుల పిల్లలను దత్తత తీసుకున్న సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాలి. అక్రమ దత్తత చట్టరీత్యా నేరం. కేంద్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానాన్ని 2014 నుంచి అమలు చేస్తున్నారు. ఠీఠీఠీ.ఛ్చిట్చ. nజీఛి.జీ n లో దరఖాస్తు చేసుకోవాలి. దత్తత విషయంలో దంపతులకు సంబంధించిన ప్రధానమైన మూడు అంశాలను సంతృప్తికరంగా ఉంటేనే బాలల సంరక్షణ కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. దంపతులు ఆరోగ్యం సామాజికపరమైన అంశాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్రమిత తదితర వ్యాధులతో అనారోగ్యం కలిగి ఉండడం, ఇతర పోలీసు కేసులు ఉండడం కనీస ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనట్లయితే దత్తత ఇవ్వరు. దత్తతకు సిద్ధమైన దంపతులు కౌన్సెలింగ్ తర్వాత దరఖాస్తు చేయడం పూర్తయ్యాక చివరి దశలో అంటే ఆరోగ్యం పోలీసులు కేసులు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అనుమతి మంజూరవుతుంది. కన్నవారే కాదంటున్నారు.. తండాల్లో ఎక్కువగా శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూడగా మళ్లీ ఆడ పిల్ల పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆడ పిల్ల పుట్టిందని వద్దు అని కుటుంబసభ్యులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు మళ్లీ ఆడపిల్లనే పుట్టింది వద్దని ఎవరైనా కావాలంటారా అని సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మద్యవర్తిగా వ్యవహరించి ఆ ఆడ శిశువును విక్రయిస్తున్నారు. వివాహమై పిల్లలు లేని వారు ముందుగా ఆసుపత్రి సిబ్బందికి చెప్పి పెడుతున్నారు. ఎవరైనా ఆడపిల్లను ఇస్తే పెంచుకుంటామని పిల్లలు లేని తల్లితండ్రులు చెబుతున్నారు. అక్రమంగా దత్తత తీసుకోవద్దు అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారా నిబంధనల ప్రకారం దత్తతను తీసుకోవాలి. అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. విక్రయించినా, కొనుగోలు చేసినా శిక్షార్హులు. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించినా, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం. – మహేందర్‌రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
హెల్మెట్ పెట్టుకుని పాఠాలు..
సాక్షి, వరంగల్ : కొన్ని సార్లు సామాన్యుల నిరసనలు.. వారు చేసే పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి నిరసనలు సమస్య తీవ్రతను తెలియజేయడమే కాకుండా, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. వరంగల్ రూరల్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేపట్టిన నిరసన కూడా ఇలాంటిదే. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తున్న ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 89 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు తరగతి గదులు ఉండగా.. అన్ని కూడా శిథిలావస్థకు చేరాయి. అలాగే ఆ పాఠశాలలో ఇతర కనీస వసతులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో స్లాబ్ పెచ్చులు ఎప్పుడూ తమపై ఊడి పడతాయనే భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. తన తలపై హెల్మెట్ ధరించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా తమ తలలపై పలకలు ఉంచి నిరసన తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆ టీచర్ నిరసన తెలుపుతున్న ఫొటో పరిస్థితి తీవ్రతను అద్ధం పట్టేలా ఉంది. -
పల్లెలను తాకని ప్రచార పవనాలు
జోరుగా ప్రచారం చేయాల్సిన సమయం.. ఇంకా 72 గంటలు గడిస్తే మైకులు మూగబోవాల్సిందే.. ఇంతటి కీలకమైన సమయంలో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొనగా, ప్రచారంలో మాత్రం ఆ ఉధృతి కానరావడం లేదు.. టీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌పై ఆధారపడగా మిగతా పార్టీల అభ్యర్థులకు కింది స్థాయి శ్రేణుల నుంచి అంతగా సహకారం అందడం లేదని తెలుస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊరువాడ మార్మోగిన ప్రచార హోరు లోక్‌సభ ఎన్నికల విషయానికొచ్చే సరికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.. ఇక ప్రచారంలో స్టార్ కాంపెయినర్ల విషయానికొస్తే టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్, కేటీఆర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరిస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారం అంతంత మాత్రంగానే సాగింది.. వీరిని పక్కన పెడితే స్వతంత్రులు పోటీలో ఉన్నా ప్రచారంలో మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. సాక్షి, వరంగల్ అర్బన్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది.. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోడానికి మరో 72 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుండగా.. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ప్రచారానికి చివరిరోజైన మంగళవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలకే పరిమితమవుతారు. ఇలా పోలింగ్ సమీపిస్తున్న వేళ వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే, అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలపై భారం వేయగా... ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతల్లో కలవరం మొదలైంది. ఇదే అదునుగా ‘ఆహా.. మాకేంటి?’ అని ఆయా పార్టీల్లోని కిందిస్థాయి నేతలు ప్రచారానికి మొండికేస్తున్నారు. ప్రచారానికి రావాలంటే కనీస ఖర్చులైనా ఇవ్వాలని బడా నేతలను కోరుతున్నట్టు సమాచారం. కానీ అభ్యర్థుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సొంత డబ్బు ఖర్చు పెడుతూ ప్రచారం చేసేందుకు నేతలు ఇష్టపడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయాన కనిపించిన ప్రచార హోరు లోక్‌సభ ఎన్నికల వేళ కనిపించడం లేదు. కానరాని ప్రచార హోరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా వరకు ప్రధాన పార్టీల ప్రచారంలో దూకు డు కనిపించడం లేదు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థులు పసునూరి దయాకర్(టీఆర్ఎస్), దొమ్మా టి సాంబయ్య(కాంగ్రెస్), చింత సాంబమూర్తి(బీజేపీ).. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత(టీఆర్ఎస్), పోరిక బలరాం నాయక్(కాంగ్రెస్), హుస్సేన్ నాయక్(బీజేపీ) నడుమే ప్రధాన పోటీ ఉంది. టీఆర్ఎస్ పక్షాన ఈనెల 2న వరంగల్ అజంజాహి మిల్లు మైదానం, 4న మహబూబా బాద్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అంతకు ముందు, ఆ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రచారసభలు, రోడ్‌షోలు నిర్వహించారు. మరో వైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ అగ్రనేత అమిత్‌షా సభ వరంగల్‌లో చివరి నిమిషంలో రద్దు కాగా, రాజ్‌నాథ్ సింగ్, సదానందగౌడ్ జిల్లా కేంద్రాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. అలాగే, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వరంగల్ సభకు హాజరయ్యారు. అయితే ఆ పార్టీ ప్రచారం పల్లె గడపకు చేరలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భూపాలపల్లి, ములుగు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్కకు తోడు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రచారం నిర్వహిస్తుండగా.. విజయశాంతి, శ్రీనివాస్ కృష్ణన్ తప్ప స్టార్ క్యాం పెయిన్లు ఎవరు రాలేదు. ఇదే సమయంలో ప్రధా న పక్షాలుగా ఉన్నా కాంగ్రెస్, బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్లో కూడా అభ్యర్థుల తరఫున ప్రచారానికి చోటామోటా నాయకులు కొందరు ముఖం చాటేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు కూడా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పుంజుకోని హస్తం, కమలం లోక్‌సభ ఎన్నికలకు సుమారు నెల రోజుల క్రితం షెడ్యూల్ విడుదల కాగా... ప్రచారంలో టీఆర్ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ ఇంకా పుంజుకోలేదు. మరో 72 గంటల్లో ప్రచారానికి తెరపడనుండగా, ఆ పార్టీల ప్రచారం ఇంకా పల్లెలను తాకలేదు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థుల గెలుపు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపును సవాలుగా తీసుకోగా.. మరికొందరు గాలివాటం తో నటిస్తున్నారన్న నివేదికలు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉన్నాయి. కొందరైతే మొక్కుబడిగానే ప్రచారం సాగిస్తున్నారంటున్నారు. ఇక వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులైన దొమ్మాటి సాంబయ్య, చింత సాంబమూర్తి, పోరిక బలరాం నాయక్, హుస్సేన్‌నాయక్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీలేదు. వారు కూడా సుడిగాలి పర్యటనలకే పరిమితమయ్యారు. ఇలా ప్రధాన పార్టీలన్ని వివిధ చోట్ల సభలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నా.. క్షేత్రస్థాయిలో జనంలోకి వెళ్లడం లేదు. గ్రామీణ ఓట్లను రాబట్టేందుకు ఆయా మండల, గ్రామస్థాయి నేతలకే బాధ్యతలు అప్పగించారు. కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ తాయిలాలు ప్రకటిస్తున్నా అవి క్షేత్రస్థాయిలో సద్వినియోగం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా స్వతంత్రంగా నామినేషన్లు వేసిన నేతలు ఎక్కడ కూడా ప్రచారంలో కనపడటం లేదు. ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ పార్లమెంట్ నుంచి 15 మంది, మహబూబాబాద్ నుంచి 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.... ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా ఇండిపెండెంట్లు ప్రచారం చేయడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, బీఎల్ఎఫ్, ఆమ్ ఆద్మీ పార్టీ, కొన్నిచోట్ల స్వతంత్రులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎక్కడ కూడా స్వతంత్రుల అభ్యర్థుల హంగామా లేదు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరుగా కనిపిస్తుంది. -
ఎండుతున్న ఆశలు..!
చెన్నారావుపేట: దేవుడు వరమించిన పూజారి కరుణించలేదనే సమేత రైతుల పట్ల నిజమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతుల కోసం ఇవ్వడంతో కష్టాలు పోయాయి అనుకున్నారు. కానీ బావులల్లో భూగర్భ జలాలు లేకపోవడంతో రైతుల ఆశలు ఎండకు ఆవిరై పోయినట్టు తయారైంది. చెరువులు, కుంటలలో నీళ్లు ఎండిపోతుండటంతో బావులల్లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వస్తే పంటలను బతికించుకోవచ్చని కలలు కన్న రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బోర్లు వేసుకొని పంటలు రక్షించుకుందామంటే అందనంత దూరంలోకి జలాలు అడుగంటిపోయి.. నీళ్ల చుక్క రాని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదలకు కృషి చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ శివారులోని బూరుగుకుంట తండాకు చెందిన బానోతు మురళికి గ్రామ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 2 ఎకరాలు భూమిలో వరి పంట వేశాడు. ఎకరంలో పసుపు పంట వేశాడు. బావిలో నీళ్లున్నాయనే ఆశతో పంట వేశాడు. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేసినా పడకపోవడంతో చేసేది ఏమి లేక చేతులెత్తేశాడు. ఎస్సారెస్పీ జలాలు వచ్చిన తన పంట పండుతుందని ఆశ పడ్డాడు. నీళ్లు రాకపోవడంతో చేసేది ఏమి లేక తన పశువులను, గేదెలను మేపుతున్నాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి... ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు.. రెండు ఎకరాలలో వరి నాటు వేశాను పంట మంచిగా పెరిగింది. బావిలో నీళ్లు ఎండిపోతుండటంతో రెండు బోర్లు రూ.1 లక్ష పెట్టి వేయింనా పడలేదు. వరి పంటలకు రూ.23 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. మంచిగా ఉన్న నీళ్లులేక ఎండిపోతుండంతో గుండె బరువెక్కింది. ఎడుద్దామనుకున్న ఏడుపు రావడం లేదు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు వచ్చిన కొంత మేర పంటను బతికించుకోవచ్చన్న ఆశ ఉంది. – బానోతు మురళి, యువ రైతు -
వర్ధన్నపేటను సిద్ధిపేటలా చేస్తా.. తన్నీరు హరీష్‌రావు
సాక్షి, వరంగల్ రూరల్/వర్ధన్నపేట: ఎన్నికల్లో వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌కు రాష్ట్రంలోనే నంబర్ వన్ మెజార్టీ ఇస్తే దత్తత తీసుకుని, వర్ధన్నపేటను సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తా అని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే గత నా మెజార్టీ దాటిపోయేలా ఉందన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే తనకు నంబర్ వన్ మెజార్టీ వస్తే.. రెండో మెజార్టీ రమేశ్‌కు వచ్చిందన్నారు. వర్ధన్నపేటలోని ఇల్లందలో ప్రజాఅశ్వీరాద సభ టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో రమేశ్ ఏం అభివృద్ధి చేయకముందే 87 వేల మెజార్టీని ఇచ్చారని, రూ.కోట్లాది నిధులను తీసుకొచ్చి వర్ధన్నపేటను అభివృద్ధి చేసిన అరూరి రమేశ్‌కు ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ దాటుందని నమ్మకం ఉందన్నారు. వర్ధన్నపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు నీరందేలా కృషి చేస్తాన్నారు. ఆకేరు వాగు వెనక ప్రాంతానికి సైతం సాగు నీటిని అందిస్తాన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గర్భిణులు కాన్పుకు పోతే రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చయ్యేవని, అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందించి ఉచితంగా కాన్పు చేసి కేసీఆర్ కిట్‌తోపాటు రూ.12 వేలు ఇచ్చి వ్యాన్‌లో ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణను తెచ్చుకున్నామని, పరాయి పాలనలో అబివృద్ధి కుంటుపడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మర్చిపోలేరన్నారు. లక్ష మెజార్టీతో గెలిపించాలి.. కడియం శ్రీహరి ఈ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం అరూరి రమేష్‌కు లక్ష ఓట్ల మెజార్టీ అందించాలని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రమేష్ ఎవరో తెలియనినాడు, ఆయన పనితనం తెలియనినాడు 87 వేల ఓట్లతో గెలిపించారని నాలుగున్నర ఏళ్లలో ఆయన చేసిన సేవలు ప్రజలు మరువరని అందుకే రాష్ట్రంలో గత ఎన్నికల్లో నంబర్ టూ మెజార్టీ సాధించిన అరూరికి హరీష్‌కు పోటీగా నంబర్ వన్ మెజార్టీ ఇవ్వాలన్నారు. సస్యశ్యామలం చేయడమే లక్ష్యం : అరూరి రమేష్ నియోజకవర్గంలో తాను నాలుగున్నర ఏళ్లు చేసిన పాలనలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం జరిగిందని రమేష్ అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నేతలు రాజయ్య యాదవ్, ఎల్లావుల లలితా యాదవ్, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కార్పొరేటర్ చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. v -
రవిచంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలి: వి.హనుమంతరావు
సాక్షి, ఖిలా వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం సర్వముఖోభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. వరంగల్ పోచమ్మమైదానంలో కాంగ్రెస్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్ధి వద్ది రాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం రాత్రి రోడ్‌షో జరిగింది. ముఖ్యఅతిథిగా హనుమంతరావు హాజరై రోడ్‌షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కుటుంబ పాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన ఘనత కేసీఆర్‌దేనిన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీలు, ఫెన్షన్ల రెట్టింపు, ఏడుకేజీల సన్నబియ్యం, విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్ మెంట్‌తోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పట్టనున్నట్లు తెలిపారు. చేతి గుర్తుకు ఓటు వేసి వద్ది రాజు రవిచంద్రను భారీ మేజార్టీతో గెలిపించాని ఆయన కోరారు. అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ తాను స్థానికుడినేనని, మున్నూరుకాపు బిడ్డను ఆదరించాలని కోరారు. చేతిగుర్తుకు ఓటు వేసి భారీ మేజార్టీని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆనంతరం రోడ్ షో పోచమ్మమైదానం నుంచి వరంగల్ చౌరస్తా, అండర్ బ్రిడ్జి, ఫోర్ట్‌రోడ్డుమీదుగా శంభునిపేట, ఆర్టీఏ జంక్షన్ వరకు సాగింది. రోడ్‌షోకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంబాడి రవీందర్, మీసాల ప్రకాశ్, ఎండీ ఆయూబ్, రాజు, కొత్తపెల్లి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
వరంగల్ రూరల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు. -
ఏసీబీ వలలో చిల్పూరు ఆలయ ఈవో
సాక్షి, వరంగల్ : లంచం తీసుకుంటూ వరంగల్ రూరల్ జిల్లా చిల్పూర్ దేవాదాయ శాఖ ఈవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఈవో జయశంకర్ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రాట్యుటీ చెక్ ఇచ్చేందుకు జయశంకర్ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేవాదాయ శాఖ ఈవో కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. -
అత్యాచార బాధితురాలి మృతి
దుగ్గొండి(నర్సంపేట): వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో లైంగికదాడితోపాటు హత్యాయత్నానికి గురై అపస్మారక స్థితికి చేరిన గురైన వివాహిత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. బాధితురాలి మృతితో తొగర్రాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, సీఐ బోనాల కిషన్ కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు నల్ల అనిత(34), నర్సయ్య కూలీ పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం ఇదే గ్రామానికి చెందిన కొక్కరకొండ కుమారస్వామి–లలిత దంపతులు తమ మొక్కజొన్న చేనులో తలసంచులు తుంచి వేయడానికి అనితతోపాటు మరో ముగ్గురిని కూలీకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో అనితకు పరిచయస్తుడైన కారు అశోక్ మొక్కజొన్న చేను వద్దకు వచ్చి అనితను పిలవడంతో ఆమె చేను కింది భాగానికి వచ్చింది. అక్కడ ఏమైందో తెలియదుగాని మొక్కజొన్న చేనులోనే అనితపై అశోక్ లైంగికదాడికా పాల్పడ్డాడు. ఆపై పలుచోట్ల విచక్షణారహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 7 గంటల సమయంలో అనితకు ఫిట్స్ వచ్చి మొక్కజొన్న చేను వద్ద పడిపోయిందని నమ్మించిన అశోక్ ఆమె బావ కుమారుడు నల్ల రాజుకు సమాచారం ఇచ్చాడు. నానాజీ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆటోను రప్పించాడు. రాజు రాగానే ఇద్దరూ కలిసి అనితను ఆటోలో వేసి స్థానికంగా ఉన్న ఆర్ఎంపీకి చూపించగా వరంగల్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో 108లో కుటుంబ సభ్యులు అదేరోజు రాత్రి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఏసీపీ సునీత పరిశీలించారు. అక్కడ అనిత ధరించిన చొక్కాతోపాటు మంగళసూత్రం దొరకడంతో స్వా«ధీ నం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని సీఐ బోనాల కిషన్, ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డిని ఆదేశించారు. మృతురాలికి భర్త నర్సయ్య, కూతుళ్లు రిజ్వానా, జ్యోత్స్న ఉన్నారు. నిందితుడిపై నిర్భయ, హత్య కేసు.. నల్ల అనిత వద్ద ఉన్న చనువుతో ఇదే గ్రామానికి చెందిన కారు అశోక్ ఆమెపై లైంగికదాడికి పాల్పడి, విచక్షణరహితంగా పలు చోట్ల దాడి చేయడంతోనే తీవ్ర గాయాలపాలై చనిపోయినట్లు మృతురాలి బావ నల్ల సారయ్య చేసిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై నిర్భయ కేసుతోపాటు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ బోనాల కిషన్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, నింది తుడిని పట్టుకుని విచారణ చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు అశోక్ సెల్‌ఫోన్‌కు ఆ రోజు ఏ ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయనే విషయాలపై కాల్‌డేటాను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. సమగ్ర విచారణ తర్వాత మిగతా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రామంలో ఉద్రిక్తత.. అనిత మృతదేహం ఎంజీఎం మార్చురీ నుంచి గ్రామానికి చేరుకోగా మృతురాలి బంధువులు మృతదేహాన్ని హత్య చేసిన వ్యక్తి ఇంటి ముందు వేస్తామని భీష్మించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అరగంటపాటు ఆందోళన చేశారు. అనంతరం సీఐ కిషన్ సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై అనేక అనుమానాలు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న అనితపై అత్యాచారం, ఆపై హత్య చేయడంపై గ్రామస్తులు , బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనితపై ఇంతలా అఘాయిత్యం జరుగుతుంటే కూలీకి తీసుకెళ్లిన రైతులుగానీ, ఆమెతోపాటు వెళ్లిన తోటి కూలీలుగానీ ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదరు వ్యక్తులంతా సంఘటన తర్వాత కనిపించకుండపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిత ఒంటిపై పలుచోట్ల విచక్షణారహితంగా నలిపిన గాయాలు ఉండటం, పెదాలు వాచిపోయి ఉండటంతో అత్యాచారం ఘటన ఒక్కరు చేయడం సాధ్యం కాదని, మరికొందరు కూడా ఉండి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నిరుపేద దళిత మహిళ మృతికి కారకులైన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.