బకాయిదారుల ఇంటి ముందు ధర్నాకు దిగిన బ్యాంకు ఉద్యోగులు
వరంగల్ రూరల్ జిల్లా : బ్యాంకు అధికారులు వినూత్నంగా ధర్నా చేపట్టిన సంఘటన వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటుచేసుకుంది. అప్పులు చెల్లించండి లేకపోతే బ్యాంక్ అధికారులు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు..అంటూ బకాయిదారుల ఇంటి ముందు బ్యాంకు అధికారులు ధర్నాకు దిగిన సంఘటన వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ) నుంచి పార్వతీ అనే డ్వాక్రా మహిళ సంఘానికి 7.5లక్షలు రూపాయలు 2016, ఫిబ్రవరి 26న నాడు మంజూరు అయింది.
ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.7.96 లక్షలు అయింది. నెలల తరబడి ఇండ్ల చుట్టూ తిరిగినా బకాయిలు కట్టకపోవటంతో విసుగెత్తిన బ్యాంకు అధికారులు బకాయి దారుల ఇంటి ముందు ధర్నాకు దిగారు. బకాయి చెల్లించాలని బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ స్రవంతి, బకాయిదారుల ఇంటికి వెళ్లి అడిగితే దుర్బాషలాడారు. దీంతో చేసేదేమీ లేక ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment