ఆ గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు | There Is Not A Single Positive Case In That Village | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు

Published Fri, Apr 16 2021 5:25 AM | Last Updated on Fri, Apr 16 2021 5:25 AM

There Is Not A Single Positive Case In That Village - Sakshi

వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన మరియపురం వాసులతో సర్పంచ్, వైద్యులు

గీసుకొండ: వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామం కోవిడ్‌ నియంత్ర ణలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రస్తుతం గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు. ఇక మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా సర్పంచ్‌ అల్లం బాలిరెడ్డి చొరవ తీసుకుని 150 మందిని గీసుకొండ పీహెచ్‌సీకి ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి టీకా వేయించారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేస్తుండటంతో గురువారం నాటికి 164 మందికి టీకా వేయించారు. ఈ ఊరి మొత్తం జనా భా 750కాగా, గ్రామంలో 45 ఏళ్లు పైబడిన మొత్తం 314 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లయింది.   

చదవండి: వ్యాక్సిన్‌ కోసం తరలొస్తున్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement