రాయచూరు రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలికి ఉపశమనం కలిగింది. ఉప లోకాయుక్త ఆదేశాలతో ఆమెకు విముక్తి లభించింది.
శిక్ష మూడేళ్లు మాత్రమే
వివరాలు.. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకావాసి నాగమ్మ 1995 లో వరకట్న వేధింపుల కేసులో నిందితురాలిగా జిల్లా కేంద్ర జైలుకు వచ్చారు. ఆనాటి నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 93 ఏళ్లు. ఆమెకు విధించిన శిక్ష 3 ఏళ్లు మాత్రమే. కానీ పట్టించుకుని బెయిలు ఇప్పించేవారు లేకపోవడంతో కటకటాలే పుట్టినిల్లయింది.
ఇటీవల ఉప లోకాయుక్త బి.వీరప్ప జైలును సందర్శించి ఆమె కథను విని చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టితో ఫోన్‌లో మాట్లాడారు. నాగమ్మకు పూర్తిగా అశక్తురాలని, ఆమెను వదిలివేయాలని ఉప లోకాయుక్త సూచించారు. జైలు సూపర్నెంటు అనిత పెరోల్ ఇవ్వడంతో బంధువులు ఆమెను తీసుకెళ్లారు.
34 ఏళ్లుగా జైల్లో.. పాపం నాగమ్మ!
Comments
Please login to add a commentAdd a comment