veerappa
-
కొలువు దీరిన కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం
కాగజ్‌నగర్: ‘‘ఎండీ సద్దాం హుస్సేన్ అనే నేను కాగజ్‌నగర్ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’ ‘‘రాచకొండ గిరీశ్‌కుమార్ అనే నేను కాగజ్‌నగర్ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’అంటూ సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వేణు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా ఎన్నికల సంఘం నియమనిబంధనలను చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు జెడ్పీ సీఈవో ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా కౌన్సిలర్ ఎల్లేష్ ప్రమాణ స్వీకారం చేశారు. 10వ వార్డు కౌన్సిలర్ అన్నబోయిన విజయ భగవంతుని ప్రమాణంతో పాటు తన భర్త వనమాల రాముపై ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార పత్రంపై సంతకాలు చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎక్స్ అఫీషియగా హాజరై పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక.. పట్టణంలోని 30 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ 22 స్థానాలు కైవసం చేసుకోగా సోమవారం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా చేపట్టారు. చైర్మన్, వైస్‌చైర్మన్ పేర్లను జెడ్పీ సీఈవో ప్రకటించారు. వారికి పార్టీ బీ ఫారం అందించినట్లు పేర్కొన్నారు. చైర్మన్ సద్దాం హుస్సేన్‌ను పంబాల సుజాత ప్రతిపాదించగా, బొద్దున విద్యావతి బలపర్చారు. వైస్‌చైర్మన్ రాచకొండ గిరీష్‌కుమార్‌ను స్వామిశెట్టి రాజేందర్ ప్రతిపాదించగా, విజయ్‌యాదవ్ కుమార్ బలపర్చారు. చైర్మన్ పదవిని సద్దాం హుస్సేన్, గిరీష్‌కుమార్ చెరో రెండున్నర సంవత్సరాలు పాలించనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం వీరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆలింగనము చేసుకున్నారు. నూతన అధ్యయనం మొదలు.. – ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నూతన అధ్యయనం మొదలైందని ఎమ్మెల్యే కోనప్ప పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధిలో, పాలనలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. చైర్మన్ హుస్సేన్, వైస్‌చైర్మన్ గిరీష్‌కుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన పాలకవర్గ సభ్యులకు, ఎమ్మెల్యే కోనప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల, పాలకవర్గం సభ్యుల నమ్మకం వమ్ముకాకుండా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. -
వీరప్ప.. తపన
కల్హేర్: మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడమేకాక, పర్యావరణ పరిరక్షణకు అవుసుల వీరప్ప విశేష కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతిమలు తయారు చేస్తూ బిజీగా మారుతారు. చంద్రప్ప- రత్నమ్మ దంపతుల ఎకైక సంతానం వీరప్ప. ఓ హోటల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి చంద్రప్ప వినాయకుడి విగ్రాహాలు తయారు చేసి గ్రామాస్తులకు సరఫరా చేసేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తండ్రి మరణించడంతో అప్పటి నుంచి వీరప్ప ఆ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు గడువు సమీపిస్తుండడం తో నామినేషన్ వేసేవారి సం ఖ్య పెరుగుతోంది. సోమవా రం నిజామాబాద్ లోక్‌సభ స్థా నానికి 05, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 20 నామినేషన్లు దాఖలయ్యా యి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వ తంత్రులు పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. నిజామాబాద్ ఎంపీ స్థానాని కి బీజేపీ తరపున సదానంద్‌రెడ్డి, వె ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మాలిక్ ముతసిమ్ఖాన్, పిరమిడ్ పార్టీ నుంచి వీరప్ప, సమాజ్‌వాది పార్టీ నుంచి అబ్దుల్ కరీం ఖాన్, స్వతంత్ర అభ్యర్థిగా సోమనర్సయ్య నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా హెచ్ఎం ఇస్మాయిల్ మహ్మద్, ముత్యాల శ్రీనివాస్, షేక్ ఖదీర్‌ఖాన్ నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి డాక్టర్ బాపురెడ్డి, బీఎస్పీ నుంచి పులి జైపాల్ నామినేషన్లు వేశారు. నిజామాబాద్ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి పిట్ల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్‌కు మొదటి నామినేషన్ దాఖలైంది. ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తలారి సత్యం, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎంఏ మాజిద్, బోధన్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి మహ్మద్ షకీల్, స్వతంత్ర అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. జుక్కల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజు, ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల శ్రీనివాస్, కామారెడ్డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బత్తిని నాగభూషణం, బీజేపీ నుంచి పబ్బ విజయ్‌కుమార్, సిద్ధిరాములు, టీడీపీ నుంచి సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా నుంచి దువాల నారాయణ నామినేషన్లు వేశారు. బాల్కొండ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, స్వతంత్ర అభ్యర్థిగా బద్ద మధుశేఖర్ నామినేషన్లు దాఖలు చేశారు.