కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు గడువు సమీపిస్తుండడం తో నామినేషన్ వేసేవారి సం ఖ్య పెరుగుతోంది. సోమవా రం నిజామాబాద్ లోక్‌సభ స్థా నానికి 05, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 20 నామినేషన్లు దాఖలయ్యా యి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వ తంత్రులు పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. నిజామాబాద్ ఎంపీ స్థానాని కి బీజేపీ తరపున సదానంద్‌రెడ్డి, వె ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మాలిక్ ముతసిమ్‌ఖాన్, పిరమిడ్ పార్టీ నుంచి వీరప్ప, సమాజ్‌వాది పార్టీ నుంచి అబ్దుల్ కరీం ఖాన్, స్వతంత్ర అభ్యర్థిగా సోమనర్సయ్య నామినేషన్లు దాఖలు చేశారు.
నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా హెచ్‌ఎం ఇస్మాయిల్ మహ్మద్, ముత్యాల శ్రీనివాస్, షేక్ ఖదీర్‌ఖాన్ నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి డాక్టర్ బాపురెడ్డి, బీఎస్‌పీ నుంచి పులి జైపాల్ నామినేషన్లు వేశారు. నిజామాబాద్ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి పిట్ల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్‌కు మొదటి నామినేషన్ దాఖలైంది. ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తలారి సత్యం, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎంఏ మాజిద్, బోధన్ అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి మహ్మద్ షకీల్, స్వతంత్ర అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు.
జుక్కల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజు, ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల శ్రీనివాస్, కామారెడ్డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బత్తిని నాగభూషణం, బీజేపీ నుంచి పబ్బ విజయ్‌కుమార్, సిద్ధిరాములు, టీడీపీ నుంచి సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా నుంచి దువాల నారాయణ నామినేషన్లు వేశారు. బాల్కొండ అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, స్వతంత్ర అభ్యర్థిగా బద్ద మధుశేఖర్ నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల జోరు
Published Tue, Apr 8 2014 3:36 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement