welfare party of india
-
‘చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి’
అమరావతి: ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాట ఇచ్చి రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తాజాగా తెలంగాణలో 12 శాతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మేరకు ముస్లింలకు రిజర్వేషన్లపై స్పందించాలని డిమాండ్ చేశారు. 15 కేటగిరీలలో 14 కేటగిరీలను మాత్రమే రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకున్నారని, 15వ కేటగిరీలోని అత్యంత వెనుక బడిన ఆరు ఉపకులాలను ఏపీలో పరిగణనలోకి తీసుకోలేదని, అదే తెలంగాణలో ఆ ఉపకులాలను కూడా తీసుకున్నారని, దీన్ని బట్టి చంద్రబాబు ముస్లింలపట్ల ఉన్న వైఖరేంటో తెలిసిందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలను కలుస్తున్నామని, త్వరలోనే సమావేశం నిర్వహించి దశల వారీగా ఆందోళనకు సిద్ధం కానున్నట్టు చెప్పారు. సత్తార్ కమిటీ ఇచ్చిన నివేదిక అమలుపై ప్రభుత్వానికి త్వరలోనే అల్టిమేటం జారీచేయనున్నట్టు చెప్పారు. -
వికారుద్దీన్ ఎన్కౌంటర్ పై నిరసన
దోమలగూడ : ఆలేరు సమీపంలో వికారుద్దీన్ సహా అయిదుగురిని బూటకపు ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చిచంపారని ఆరోపిస్తూ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సయ్యద్ ఫక్రుద్దీన్, మహిళా విభాగం జాతీయ కన్వీనర్ ఖలీదా ఫర్వీన్లు మాట్లాడుతూ ఎవరైనా నేరానికి పాల్పడితే కోర్టులో హాజరు పర్చాలే తప్పా పోలీసులు ఇలా వ్యవహరిస్తారా అని నిలదీశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయం ముట్టడి, అవసరమైతే రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తాజ్ అహ్మద్, ఉదయ్‌కిరణ్, అజ్మత్, సుదర్శన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ
ఆర్మూర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారంతో నామినేషన్ల పర్వం ముగియడంతో జిల్లా ఎన్నికల ఉప అధికారి గజ్జన్న ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఈ పరిశీలన సమయంలో కాంగ్రెస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన నాయకులు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి షేక్ మహబూబ్ అలియాస్ గుడ్ల బాబాపై ఆరోపణలతో చేసిన ఫిర్యాదు కారణం గా ఉత్కంఠ పరిస్థితి నెల కొంది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ఎంఏ మాజిద్ నామినేషన్ ప త్రాల్లో అతని అభ్యర్థిత్వా న్ని ప్రతిపాదిస్తూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి షేక్ మహబూబ్ సంతకాలు చేశాడంటూ అతనిని పో టీకి అనర్హునిగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పీసీ భోజన్న, పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కలిసి వేరు వేరుగా ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేశారు. దీంతో జిల్లా ఎన్నికల ఉప అధికారి గజ్జన్న షేక్ మహబూబ్‌ను పిలిపించి వివరణ కోరారు. ఎంఏ మాజిద్ నామినేషన్ పత్రాలపై తాను సంతకం చేయలేదని తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీంతో పూర్తి స్థాయి విచారణ అనంతరం ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, వె ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులను పిలిపించిన ఎన్నికల అధికారి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా షేక్ మహబూబ్ పోటీ చేయడానికి అర్హుడని ప్రకటించారు. ఎవరైనా ఒక ఓటరు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రతిపాదించిన పక్షంలో అతను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అనర్హుడు అని తెలిపే ఏ నిబంధన ఎన్నికల నియమావళిలో లేనందున వారి ఫిర్యాదును తిరస్కరిస్తున్నామన్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిపై వచ్చిన ఫిర్యాదు విషయమై పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న నిజామాబాద్ అర్బన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, షేక్ మహబూబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
నామినేషన్ల జోరు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు గడువు సమీపిస్తుండడం తో నామినేషన్ వేసేవారి సం ఖ్య పెరుగుతోంది. సోమవా రం నిజామాబాద్ లోక్‌సభ స్థా నానికి 05, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 20 నామినేషన్లు దాఖలయ్యా యి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వ తంత్రులు పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. నిజామాబాద్ ఎంపీ స్థానాని కి బీజేపీ తరపున సదానంద్‌రెడ్డి, వె ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మాలిక్ ముతసిమ్ఖాన్, పిరమిడ్ పార్టీ నుంచి వీరప్ప, సమాజ్‌వాది పార్టీ నుంచి అబ్దుల్ కరీం ఖాన్, స్వతంత్ర అభ్యర్థిగా సోమనర్సయ్య నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా హెచ్ఎం ఇస్మాయిల్ మహ్మద్, ముత్యాల శ్రీనివాస్, షేక్ ఖదీర్‌ఖాన్ నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి డాక్టర్ బాపురెడ్డి, బీఎస్పీ నుంచి పులి జైపాల్ నామినేషన్లు వేశారు. నిజామాబాద్ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి పిట్ల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్‌కు మొదటి నామినేషన్ దాఖలైంది. ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తలారి సత్యం, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎంఏ మాజిద్, బోధన్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి మహ్మద్ షకీల్, స్వతంత్ర అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. జుక్కల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజు, ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల శ్రీనివాస్, కామారెడ్డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బత్తిని నాగభూషణం, బీజేపీ నుంచి పబ్బ విజయ్‌కుమార్, సిద్ధిరాములు, టీడీపీ నుంచి సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా నుంచి దువాల నారాయణ నామినేషన్లు వేశారు. బాల్కొండ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, స్వతంత్ర అభ్యర్థిగా బద్ద మధుశేఖర్ నామినేషన్లు దాఖలు చేశారు. -
బోధన్‌లో ముక్కోణపు పోటీ
బోధన్, న్యూస్‌లైన్ : బోధన్ మున్సిపాలిటీలో 35 వార్డులున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, లోక్‌సత్తా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 317 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలపగా కాంగ్రెస్ 34 మందిని పోటీ పెట్టింది. ఎంఐఎం 28, టీడీపీ 23, బీజేపీ 16 స్థానాల్లో బరిలో నిలిచింది. వైఎస్ఆర్సీపీ, లోక్సత్తాలనుంచి ముగ్గురు చొప్పున పోటీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బలంగా ఉండడంతో పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. వైఎస్ పథకాలతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు విజయం చేకూరుస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. 16 వార్డులలో పోటీ చేస్తున్న బీజేపీ.. అందులో సగం స్థానాలను గెలుచుకున్నా చైర్మన్ ఎన్నికలో కీలకపాత్ర పోషించవచ్చని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర వివరిస్తూ అభ్యర్థులు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నరేంద్రమోడీ హవా కలిసొస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్.. గత మున్సిపల్ ఎన్నికల్లో రెండే కౌన్సిలర్ స్థానాలకు పరిమితమైన టీఆర్ఎస్.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బలపడింది. ఈసారి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణ రాష్ట్ర కల తమ పార్టీ వల్లే నెరవేరిందని, తెలంగాణ వికాసం కూడా టీఆర్ఎస్ వల్లే సాధ్యమని ప్రచా రం చేస్తోంది. పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు ఆ పార్టీలో చేరి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆధిక్యత తమదేనన్న ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. ఎంఐఎం.. ఎంఐఎం కూడా బోధన్ బల్దియాపై దృష్టి సారించింది. 10 నుంచి 12 వార్డు ల్లో తమకు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు పేర్కొం టున్నారు. మరో ఆరు వార్డులపై దృష్టి సారించారు. ఈసారి బల్దియాపై తమ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఆ పార్టీ నాయకులున్నారు.