దోమలగూడ : ఆలేరు సమీపంలో వికారుద్దీన్ సహా అయిదుగురిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చిచంపారని ఆరోపిస్తూ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సయ్యద్ ఫక్రుద్దీన్, మహిళా విభాగం జాతీయ కన్వీనర్ ఖలీదా ఫర్వీన్‌లు మాట్లాడుతూ ఎవరైనా నేరానికి పాల్పడితే కోర్టులో హాజరు పర్చాలే తప్పా పోలీసులు ఇలా వ్యవహరిస్తారా అని నిలదీశారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయం ముట్టడి, అవసరమైతే రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తాజ్ అహ్మద్, ఉదయ్‌కిరణ్, అజ్మత్, సుదర్శన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ పై నిరసన
Published Thu, Apr 9 2015 12:41 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement