బోధన్, న్యూస్‌లైన్ : బోధన్ మున్సిపాలిటీలో 35 వార్డులున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం, టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ, లోక్‌సత్తా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 317 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలపగా కాంగ్రెస్ 34 మందిని పోటీ పెట్టింది. ఎంఐఎం 28, టీడీపీ 23, బీజేపీ 16 స్థానాల్లో బరిలో నిలిచింది. వైఎస్‌ఆర్‌సీపీ, లోక్‌సత్తాలనుంచి ముగ్గురు చొప్పున పోటీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు బలంగా ఉండడంతో పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు.
వైఎస్ పథకాలతో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు విజయం చేకూరుస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. 16 వార్డులలో పోటీ చేస్తున్న బీజేపీ.. అందులో సగం స్థానాలను గెలుచుకున్నా చైర్మన్ ఎన్నికలో కీలకపాత్ర పోషించవచ్చని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర వివరిస్తూ అభ్యర్థులు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నరేంద్రమోడీ హవా కలిసొస్తుందని భావిస్తున్నారు.
తెలంగాణ నినాదంతో టీఆర్‌ఎస్..
గత మున్సిపల్ ఎన్నికల్లో రెండే కౌన్సిలర్ స్థానాలకు పరిమితమైన టీఆర్‌ఎస్.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బలపడింది. ఈసారి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణ రాష్ట్ర కల తమ పార్టీ వల్లే నెరవేరిందని, తెలంగాణ వికాసం కూడా టీఆర్‌ఎస్ వల్లే సాధ్యమని ప్రచా రం చేస్తోంది. పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు ఆ పార్టీలో చేరి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆధిక్యత తమదేనన్న ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు.
ఎంఐఎం..
ఎంఐఎం కూడా బోధన్ బల్దియాపై దృష్టి సారించింది. 10 నుంచి 12 వార్డు ల్లో తమకు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు పేర్కొం టున్నారు. మరో ఆరు వార్డులపై దృష్టి సారించారు. ఈసారి బల్దియాపై తమ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఆ పార్టీ నాయకులున్నారు.
బోధన్‌లో ముక్కోణపు పోటీ
Published Tue, Mar 25 2014 2:51 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement