15 కేటగిరీలలో 14 కేటగిరీలను మాత్రమే రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకున్నారని, 15వ కేటగిరీలోని అత్యంత వెనుక బడిన ఆరు ఉపకులాలను ఏపీలో పరిగణనలోకి తీసుకోలేదని, అదే తెలంగాణలో ఆ ఉపకులాలను కూడా తీసుకున్నారని, దీన్ని బట్టి చంద్రబాబు ముస్లింలపట్ల ఉన్న వైఖరేంటో తెలిసిందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలను కలుస్తున్నామని, త్వరలోనే సమావేశం నిర్వహించి దశల వారీగా ఆందోళనకు సిద్ధం కానున్నట్టు చెప్పారు. సత్తార్ కమిటీ ఇచ్చిన నివేదిక అమలుపై ప్రభుత్వానికి త్వరలోనే అల్టిమేటం జారీచేయనున్నట్టు చెప్పారు.
‘చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి’
Published Tue, Apr 18 2017 9:15 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
అమరావతి: ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాట ఇచ్చి రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తాజాగా తెలంగాణలో 12 శాతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మేరకు ముస్లింలకు రిజర్వేషన్లపై స్పందించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement