లండన్ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు | TRS NRI Wing Celebrates KCR Birthday In London | Sakshi
Sakshi News home page

లండన్ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Published Mon, Feb 17 2020 9:08 PM | Last Updated on Mon, Feb 17 2020 9:12 PM

TRS NRI Wing Celebrates KCR Birthday In London - Sakshi

లండన్ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ జన్మదిన వేడుకలను లండన్‌ ఎన్నారై టీఆర్ఎస్ యుకే శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంఘం అధ్యక్షుడు అశోక్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కేసీఆర్‌ అభిమానులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అశోక్ దూసరి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ యుకే శాఖ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. అలాగే ఎన్నారై టీఆర్ఎస్‌ సెల్కి కేసీఆర్‌, మాజీ ఎంపీ కవిత ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ తెలంగాణ బిడ్డ కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచడం చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సంఘం సలహా బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రసంగిస్తూ.. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు యావత్ దేశానికే తలమానికంగా నిలవడం కేసీఆర్ గొప్పదనమని వ్యాఖ్యానించారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ ఐటీ కార్యదర్శి వినయ్ ఆకుల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సలహాలు సందేశాలు ఉన్నా వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు. అనంతరం అందరి సమక్షంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు రక్తదానం చేశారు. ప్రజలంతా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

చివరిగా ఈ కార్యక్రమ ఇంచార్జ్ సత్యచిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి మాట్లాడుతూ.. ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణం లో కేసీఆర్ వెంటే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అద్యక్షులు అశోక్ గౌడ్ దుసరి,  ఉపాధ్యక్షులు  నవీన్ రెడ్డి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, కార్యదర్శులు హరి బాబు,  సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, అధికార ప్రతినిధులు రవి పులుసు, రవి రేతినేని, ఐటటీ సెక్రటరీ వినయ్ ఆకుల, ఆరూరి విశాల్, దుసరి సాయి కుమార్ గౌడ్, జవహర్లాల్ రామావత్, కాసుల భరత్, వేణు వివేక్ చెరుకు, టిల్లీస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రణీత్, క్రాంతి పుట్ట,రాజ శేఖర్ రావు,అబ్దుల్లాహ్, ప్రణయ్, తరుణ్ రెడ్డి, సోహెల్ కహ్న్, కమల్, మనోహర్ మిట్ట, సయీద్ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement