
పుట్టిన రోజు వేడుకలో రజనీ దంపతులు
తమిళనాడు,పెరంబూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పుట్టిన రోజు వేడుకను 10 రోజుల ముందే శాస్త్రోత్తంగా వేదమంత్రాల మధ్య జరుపుకున్నారు. రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబరు 12 అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఉండగా ఆయన సోమవారమే తన పుట్టిన రోజు వేడకను జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ ఇటీవల 2021 సంచలనంగా మారనుందనే పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా త్వరలో రాజకీయరంగ ప్రవేశానికి రెడీ అవుతున్న రజనీకాంత్ జన్మనక్షత్రం శ్రావణం. కాగా సోమవారం శ్రావణ నక్షత్రం ప్రారంభం కావడంతో రజనీకాంత్ తన పుట్టిన రోజును అదే రోజున వేదమంత్రాల మధ్య జరుపుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రజనీకాంత్, ఆయన భార్య లతారజనీకాంత్ పూల దండలు మార్చుకుని విశేష పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment