ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు | Nandamuri Balakrishna Fans To Celebrates On His 61st Birthday | Sakshi
Sakshi News home page

కూకట్ పల్లిలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు 

Jun 10 2021 4:53 PM | Updated on Jun 10 2021 4:56 PM

Nandamuri Balakrishna Fans To Celebrates On His 61st Birthday - Sakshi

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య వీరాభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని మంచి సేవాతత్పరతతో నిర్వహించి శెభాష్ అనిపించుకుంది. 


బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు ఉచిత వ్యాక్సిన్ పంపకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు బాలకృష్ణ తర్వాతి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి శంకర్, 14 రీల్స్ ప్లస్  అధినేత రామ్ ఆచంట హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement