‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న బాలయ్య ఫాన్స్‌ | Nandamuri Balakrishna Fans Fire On Andhra Jyothi Paper News On Nara Lokesh Yuvagalam Meeting - Sakshi
Sakshi News home page

బాలయ్య మిస్సింగ్‌.. ‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న ఫ్యాన్స్‌

Published Fri, Dec 22 2023 10:18 AM | Last Updated on Fri, Dec 22 2023 12:03 PM

Nandamuri Balakrishna Fans Fire On Andhra Jyothi - Sakshi

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, సాక్షి: వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు భగ్గుమన్నారు.  ఏకంగా ఆ పత్రిక పేపర్లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కావలిలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పని చేశారు. ఇందుకు కారణం ఏంటంటే.. 

తాజాగా నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం- నవశకం పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే.. ఆయన పేరునుగానీ, ఫోటోగానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించలేదట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను ఆయన అభిమానులు తగలబెట్టారు. 


ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పేపర్‌, ఏబీఎన్‌ ఛానెల్‌ నందమూరి బాలకృష్ణ పట్ల గత కొంతకాలంగా వివక్షత చూపుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని వెన్నుపోటు ద్వారా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా? అని అదీ లేదు. దీనికి తోడు.. ఇప్పుడు యెల్లో మీడియా కూడా కేవలం నారా కుటుంబాన్నే హైలెట్‌ చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. 

ఇదీ చదవండి: పవన్‌ తమ్ముడా?.. వీళ్లు మారరా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement