Balakrishna Akhanda Movie Show Cancelled In Australia - Sakshi
Sakshi News home page

Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్‌ రచ్చ, ఆస్ట్రేలియాలో షో రద్దు

Published Thu, Dec 2 2021 7:12 PM | Last Updated on Thu, Dec 2 2021 8:16 PM

Balakrishna Akhanda Movie Show Cancelled In Australia - Sakshi

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు విడుదలై సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ నందమూరి ఫ్యాన్స్‌తో ఫుల్‌ అయ్యాయి. థియేటర్ల దగ్గర ప్రేక్షకులు జై బాలయ్య అంటూ కేకలు, ఈళలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లల్లో పండగ వాతావరణం నెలకొంది. మూములుగానే బాలయ్య సినిమా చూస్తున్న ఫ్యాన్స్‌ అంతా పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అలాంటి వాళ్లు ఇక అఖండ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా విశ్వరూపం చూపించాడు.

చదవండి: వైరల్‌ అవుతోన్న కమెడియన్‌ రఘు షాకింగ్‌ వీడియో!

ఇక ఫ్యాన్స్‌ను ఆపడం కష్టమే. ఇండియాలోనే కాదు విదేశాల్లోని థియేటర్లో కూడా అభిమానులంతా ఊగిపోతూ నానా రచ్చ చేస్తు‍న్నారట. దీంతో వారి దెబ్బకు థియేటర్లో షోను రద్దు చేయాల్సి వచ్చిందట. ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు కొన్ని స‌న్నివేశాలు వ‌చ్చిన‌ప్పుడు తెగ కేకలు వేస్తూ రచ్చ చేశార‌ట‌. దీంతో థియేటర్ యజమానులు మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు ఏమాత్రం తగ్గకపోవడంతో చివరకు పోలీసులను రంగంలోకి దిగాల్సి వచ్చింది. షోను ఆపేసి ప్రేక్షకులకు వార్నింగ్ పోలీసులు వెళ్లిపోయారట. స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రజ్ఞా జైస్వాల్ నటిచింది. ఇక జగపతి బాబు, శ్రీకాంత్‌లు విలన్‌గా ఆకట్టుకుంటున్నారు. 

చదవండి: బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement