Balakrishna Celebrated His Young Lady Fan Birthday At TANA Celebrations, Pic Viral - Sakshi
Sakshi News home page

యువతికి కేక్‌ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..

Published Tue, Jul 11 2023 10:24 AM | Last Updated on Tue, Jul 11 2023 10:29 AM

Balakrishna Celebrated To Young Lady Fan Birthday - Sakshi

జులై 7వ తేదీ నుంచి 9వరకు అమెరికా ఫిలడెల్ఫియాలో జరిగిన తానా సభల్లో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్న సంగతి తెలిసిందే. తానా సంబరాల్లో బాలకృష్ణ కుటుంబంతో పాటు  ఓ యువతి దిగిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఆ యువతి ఎవరని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో వెతుకుతున్నారు.

(ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్‌..?)

ఇంతకు తనెవరంటే... తానా సభలో తన అభిమానిని అంటూ ఓ యువతి బాలయ్య దగ్గరకు వచ్చింది. ఈరోజు తన పుట్టినరోజని ఆశీర్వదించమని కోరింది. దీంతో వెంటనే ఆమె కోసం కేక్‌ తెప్పించి కటింగ్‌ చేయించారు బాలయ్య. ఆ విధంగా పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. ఆయన సతీమణి వసుంధరతో పాటు ఆ యువతిని ఆశీర్వదించారు. ఆ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని బాలయ్య అందించారు.  ఇవే  ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

(ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement