![Suddep Fans Animal Sacrifice In Front Of Flex Over His Birthday Celebration - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/4/suddep.jpg.webp?itok=lNCcFflx)
తమ అభిమాన హీరోల పుట్టిన రోజు అంటే చాలు అభిమానులు చేసే రచ్చ అంతాఇంత కాదు. బర్త్‌డేకు పది రోజుల ముందు నుంచే నానా హంగామ చేస్తారు. ఫ్లెక్సీలు, భారీ భారీ కటౌట్స్, కేక్ కంటిగ్, బాణా సంచాలు పేల్చడంతో పాటు రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇక కన్నడ స్టార్ హీరో సుదీప్ బర్త్‌డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజున రక్తదానం ఇవ్వడం, బాణ సంచాలు పేలుస్తూ బహిరంగ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అంతేగాక వీధి వీధికి సుదీప్ కటౌట్స్, ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు.
చదవండి: హీరో సూర్య పాట విని కన్నీళ్లు ఆపుకోలేకపోయా: అమితాబ్
అయితే ఈ సారి వారి అభిమానం తారాస్థాయికి చేరింది. ఇటీవల(సెప్టెంబర్ 2) ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు మరింత రెచ్చిపోయారు. బళ్లారి జిల్లాలోని సండూరి తాలూక్ బండ్రి వద్ద సుదీప్ ఫ్లెక్సీ ముందు ఫ్యాన్స్ అంతా బహిరంగంగా చేరి దున్నపోతును బలిచ్చారు. సద్భావన పేరుతో జీవ హింసకు వ్యతిరేకంగా వారు జంతుబలి ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో సుదీప్ ఫ్యాన్స్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment