
టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రీహాబిటేషన్ పేరుతో ఎన్‌సీఏ అకాడమీలో ఉన్నాడు. కాగా డిసెంబర్ 21న రోహిత్ శర్మ భార్య రితిక సజ్‌దేహ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రోహిత్‌శర్మ తన ప్రియమైన భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌కు సందేశాన్ని అందించాడు. ''ఇది హ్యాపియస్ట్ బర్త్‌డే మై లవ్. ఇప్పటివరకు ఎలా ఉన్నావు.. ఇప్పుడు అలాగే ఉండు. నీలో నన్ను బాగా ఆకట్టుకునేది అదే'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
చదవండి: IND vs SA: ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్
ఇక గాయపడ్డ రోహిత్ స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండనున్న రోహిత్.. వన్డే సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరపున రోహిత్ శర్మ 43 టెస్టుల్లో 3047 పరుగులు, 227 వన్డేల్లో 9205 పరుగులు, 119 టి20ల్లో 3197 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment