
∙వైజయంతి మాలతో దిలీప్‌కుమార్ , ∙ట్విట్టర్‌లో దిలీప్‌కుమార్ లేటెస్ట్ ఫొటో
‘పన్నెండొందలా యాభై రూపాయలు. అమ్మో! అంత అమౌంటే! ఏడాదికి పన్నెండొందల యాభై రూపాయలా!’ అని మురిసిపోయాడు దిలీప్ కుమార్. అదే.. తన మొదటి ఉద్యోగం. బాంబే టాకీస్ దేవికారాణి గారు ఇచ్చిన ఉద్యోగం. అలా మొదలైంది హీరో దిలీప్ కుమార్ ప్రస్థానం. తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ జీతం ఏడాదికి కాదు, ప్రతి నెలా అని. దిలీప్ కుమార్ సంతోషానికి అవధులు లేవు. ప్రస్తుతం ఆయన తొంభై ఐదేళ్లకు దగ్గరగా ఉన్నారు. ఈ నెల 11న ఆయన పుట్టిన రోజు. ఆయన ఆరోగ్యం కొంచెం అలా అలా ఉంది. ‘పుట్టినరోజు గొప్పగా జరుపుకుంటున్నారా?’ అని అడిగితే, ‘కుటుంబంతోనే జరుపుకుంటా’ అని అన్నాడు. ట్రాజెడీ కింగ్‌గా.. అల్టిమేట్ మెథడ్ యాక్టర్‌గా ఈయనను సత్యజిత్‌రే అభివర్ణించాడు. అలాంటి ట్రాజెడీ హీరో ఇంకా ఎన్నో వసంతాలు జరుపుకోవాలని బాలీవుడ్ అంతా ఆకాంక్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment