Allu Arjun Celebrates His Team Member Sarath Chandra Naidu Birthday, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: టీమ్‌ మెంబర్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన బన్నీ

Mar 19 2022 11:08 AM | Updated on Mar 19 2022 6:17 PM

Allu Arjun Celebrates Team Member Birthday - Sakshi

స్టార్‌ హీరోల్లో కొంత మంది మాత్రమే సింపుల్‌గా ఉంటారు. హీరోని అనే ఫీలింగ్‌ లేకుండా సాదాసీదా ఉంటూ అందరితో కలిసిపోతుంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్‌ ఒకరు. తన చుట్టూ ఉండే వ్యక్తులతో ఎప్పుడూ స్టార్‌ హీరోలాగా ప్రవర్తించరు. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులను సొంత మనుషుల్లా చూసుకుంటారు. తాజాగా ఈ ఐకాన్‌ హీరో.. తన కంటెంట్‌, డిజిటల్‌ హెడ్‌ అయిన శరత్‌ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుకని ఘనంగా జరిపారు. డిజిటల్ హెడ్ పుట్టిన రోజు కావడంతో సడన్‌గా కేక్‌ తీసుకొచ్చి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు.  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌  అన్నీ ఆ కేక్ మీద హైలెట్ చేశారు. దీన్ని బట్టి తన టీమ్ ను ఆయన ఎంత స్పెషల్ గా చూసుకుంటారో అర్థమవుతుంది.

తన స్టాఫ్‌ బర్త్‌డే వేడుకలను సెలబ్రేట్‌ చేయడం బన్నీకి ఇది మొదటిసారి మాత్రమే కాదు. చాలా సార్లు చాలా మంది బర్త్‌డేలను సెలబ్రేట్‌ చేశారు. స్పెషల్‌ అకేషన్స్‌ అన్ని అలానే చేస్తుంటాడు. పెళ్లిళ్లకు కూడా హాజరవుతుంటారు. అందుకే ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయిస్‌.. ఇలాంటి బాస్‌ దొరకడం అదృష్టం అంటుంటారు.  

ఇక బన్నీ సినిమాల విషయానికిస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత సంజయ్‌లీలా భన్సాలీతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే  రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు టీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement