షాపింగ్ చేయాలన్నా..నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. టికెట్ బుకింగ్స్ కోసం, ఇంటి అద్దె చెల్లించడం కోసం, ఇలా అవీ ఇవీ అని తేడా లేకుండా క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాడకం మంచిదే కానీ.. కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించి రెంట్ (అద్దె) కట్టడం మంచిదేనా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం.. రివార్డ్ పాయింట్లను కూడబెట్టుకోవడానికి లేదా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి మంచి వ్యూహం కావచ్చు. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపు
ప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించినప్పుడు, కొంతమంది ఓనర్స్ లేదా ఏజెన్సీలు ప్రాసెసింగ్ ఛార్జీలను సైతం వసూలు చేస్తారు. ఈ ఛార్జి మీరు చెల్లించే అద్దెలో రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది.
క్యాష్ అడ్వాన్స్ ఫీజు: అద్దె చెల్లింపులను సాధారణ లావాదేవీలుగా పరిగణించడానికి బదులు.. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వాటిని క్యాష్ అడ్వాన్స్‌లుగా పరిగణిస్తారు. దీనికి సాధారణ వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
గత బకాయి చెల్లింపులపై వడ్డీ: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించకపోతే.. అది తప్పకుండా మీ మీద ఆర్ధిక భారం పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అద్దె చెల్లిస్తే.. వడ్డీ మరింత ఎక్కువవుతుంది.
క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించే ముందు తెలుసుకోవసిన అంశాలు
ఫీజులు: అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల.. ప్రాసెసింగ్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.
వడ్డీ ఆధారిత ఫీజులు: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడాం వల్ల లాభాలు
రివార్డ్‌లను సంపాదించవచ్చు: క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే.. క్యాష్ బ్యాక్ లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లను పొందవచ్చు. ఇది షాపింగ్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి షాపింగ్ సమయంలో కొంత డబ్బు ఆదా అవుతుంది.
క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేయడం వల్ల.. క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
అద్దె చెల్లించడంలో ఆలస్యం నివారించవచ్చు: చేతిలో డబ్బు లేకపోయినా.. మీరు క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో అద్దె చెల్లించవచ్చు. ఒకవేళా ఇంటి ఓనర్.. అద్దె ఆలస్యం చేస్తే విధించే ఫెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.
పేమెంట్ సెక్యూరిటీ: క్రెడిట్ కార్డు హిస్టరీ వల్ల మిమ్మల్ని ఎవరూ మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి మీ చెల్లింపులకు ఇక్కడ భద్రత లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment