సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులను చాలా సేవలకు కస్టమర్లు ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె కడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే ఫీజులు వసూలు చేయనుంది.
అక్టోబర్ 20 నుంచి ఈ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్‌లు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఐసీఐ వసూలు చేయనున్న రుసుముకి ఇది అదనం కానుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీజు వసూలు చేసే జాబితాలో ఐసీఐసీఐ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మిగతా బ్యాంకులు ఈ తరహా నిర్ణయాన్నే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
వెనక ఇంత కథ జరుగుతుందా! అందుకే..
అసలు కథేంటంటే.. క్రెడ్( Cred), రెడ్ గిరాఫీ( RedGiraffe), మైగేట్( Mygate), పేటీఎం( Paytm) మ్యాజిక్ బ్రిక్స్( Magicbricks) వంటి ప్లాట్‌ఫాంలో ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించే వెసలుబాటు ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంలో కస్టమర్లు తమ కుటుంబాన్ని లేదా స్నేహితులను ఇంటి ఓనర్లుగా చేర్చుకుని, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డుని ఉపయోగించడం ద్వారా నగదు పొందుతున్నారు. సాధారణంగా అయితే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం( ATM) నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే 2.5-3% వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే రెడ్ గిరాఫీ( RedGiraffe) మినహా ఈ సేవలను అందిస్తున్న అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు రెంట్ పేమెంట్ ధృవీకరించే అద్దె ఒప్పందాన్ని అడగడం లేదు. దీంతో క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫీచర్ ద్వారా అద్దె చెల్లింపు పేరుతో కొందరు కస్టమర్లు సులభంగా, ఏ ఫీజులు లేకుండా నగదుని పొందే అవకాశం ఉంది. ఇటీవల ఈ తరహా చెల్లింపులు ఎక్కువ కావడంతో బోగస్ పేమెంట్లను ఆపేందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!
Comments
Please login to add a commentAdd a comment