సాక్షి, తమిళనాడు : పట్టుకోటైలో ఓ డాక్టర్ దుకాణాల అద్దెలను రద్దు చేసి వ్యాపారులకు అండగా నిలిచారు. తంజావూరు జిల్లా పట్టుకోటైకు చెందిన కనకరత్నం (91). అతని భార్య రాజ్యలక్ష్మి. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. కుమారుడు స్వామనాథన్ కోడలు వర్ష డాక్టర్‌గా పని చేస్తున్నారు. రత్నం తనకు సొంతమైన స్థలంలో ఆరు కట్టడాలు నిర్మించి అద్దెకు ఇచ్చారు. లాక్‌డౌన్ కారణంగా దుకాణాలకు తాళం వేయబడి ఉంది. ఈ అద్దెదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో నెలకు రూ.1.5 లక్షల చొప్పున మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల మొత్తం రూ.4.5 లక్షలు రద్దు చేశాడు. చదవండి: అక్కడబ్బాయి..ఇక్కడమ్మాయి.. నడిరోడ్డుపై పెళ్లి
దీనిపై దుకాణదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మానవ దృక్ఫథంతో డాక్టరు చేసిన ఈ పనికి పలువురు అభినందనలు తెలిపారు. దీనిపై కనకరత్నం మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో వ్యాపారులు ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం అందించారని, వారు ఇబ్బంది పడకుండా అద్దె రద్దు చేసినట్లు తెలిపారు. దీని గురించి వ్యాపారులు మాట్లాడుతూ తన వద్దకు చికిత్సకు వచ్చే రోగుల వద్ద ఇప్పటి వరకు రూ.10 ఫీజు వసూలు చేసినట్లు చెప్పారు. కుమారుడు, కోడలు రూ.50 తీసుకుని వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. చైనా యుద్ధం జరిగిన సమయంలో తన కుమార్తె వివాహం దాచిన 83 సవర్ల నగలను కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా అందచేసినట్లు తెలిపారు.
చదవండి: 32 మంది రైతులపై కేసు
Comments
Please login to add a commentAdd a comment