
సాక్షి, గోల్కొండ (హైదరాబాద్): ఇల్లు ఇప్పిస్తానంటూ ఓ మహిళపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాలెనగర్ కంచెకు చెందిన ఓ మహిళ (28) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆమెను కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఉండే రఫీక్ పరిచయం చేసుకున్నాడు.
షాహిన్ నగర్‌లో ఇల్లు ఇప్పిస్తానంటూ ఒక రోజు ఆమెను కార్లో ఎక్కించుకుని పాతనగరం తీసుకెళ్లాడు. అక్కడ బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. ఫొటోలు కూడా తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు. కాగా ఈ ఘటనపై గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దీనిపై వివరణ కోరగా..బాధితురాలి ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
చదవండి: (చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు)
Comments
Please login to add a commentAdd a comment