
ముంబయి: బాలీవుడ్ నటి మల్లికా శెరావత్‌ను పారిస్‌లో అద్దె ఇల్లు కష్టాలు వీడటం లేదు. ఇంటి అద్దె ఎగ్గొట్టడంతో యజమాని ఆమెను, ఆమె ప్రియుడు సిరిల్ ఆక్సన్‌ఫాన్స్‌ను ఇంటినెంచి గెంటివేశారని గతేడాది మీడియాలో కథనాలు రాగా, హాట్ భామ మల్లికా ఘాటుగానే స్పందించారు. వివాదం సద్దుమణిగిందని ఆమె భావించింది. కానీ కొత్త సంత్సరంలో ఏకంగా కోర్టు నోటీసులు జారీ చేసిందని, రూ.64 లక్షల అద్దె చెల్లించకపోవడంతో యజమాని గెంటివేశాడంటూ మళ్లీ ఆమె గురించి ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మల్లికా తనను ఎవరూ ఇంటినుంచి గెంటివేయలేదని, అవమానించలేదని స్పష్టం చేశారు మల్లికా.
మరికొందరు తనకు పారిస్‌లో ఇల్లు ఉందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది. తనకు ప్యారిస్‌లో అసలు ఇల్లే లేదని, అసలు అక్కడ ఎవరి ఇంట్లోనూ ఉండలేదని తెలిపింది. అక్కడ అద్దెకు ఉండకుండా అద్దె ఎగ్గొట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ‘సొంత ఇల్లు ఉందని ప్రచారం చేసేవాళ్లు.. నాకు పారిస్‌లో ఇల్లు ఏమైనా దానం చేయాలనుకుంటున్నారా.. నా పేరున ఇదివరకే ఇల్లు ఉండి ఉంటే ఇంటి అడ్రస్ ఇస్తే ప్రశాంతంగా అందులోనే ఉంటానని’ మల్లికా శెరావత్ స్పందించారు. గతంలో ఓసారి అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొందరు ఆగంతకులు దాడి చేయగా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ కథనాలను నటి మల్లిక కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment