మీడియా పుకార్లపై స్పందించిన మల్లికా | Mallika Sherawat on Paris apartment kicked out News | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 11:50 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

Mallika Sherawat on Paris apartment kicked out News  - Sakshi

సాక్షి, ముంబై : మీడియాలో వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు నటి మల్లికా షెరావత్‌ స్పందించారు. పారిస్‌.. ఇల్లు.. ఖాళీ చేయించటం వార్త నిజం కాదని ఆమె చెప్పారు. భారీగా బకాయిలు పడటంతో ఆమెను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించినట్లు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ఆమె తన ట్విట్టర్‌లో స్పందించారు. పారిస్‌లో ఇల్లు అంటూ వస్తున్న వార్త నిజం కాదు. నాకు అసలు ఇల్లు లేదు. అద్దెకూ ఉండటం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు దానం చేయాలనుకుంటే వారి అడ్రస్‌ నాకు పంపండి అంటూ వ్యంగ్యంగా ఆమె ట్వీటారు. కాగా, పారిస్‌లోని విలాసవంతమైన ఈ అపార్ట్‌మెంట్‌లో బాయ్‌ ఫ్రెండ్‌ సిరిల్‌ ఆక్సన్‌ఫాన్స్‌తో ఆమె నివసించారు. గతంలో ఓసారి ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొందరు ఆగంతకులు దాడి చేయగా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. 

సుమారు 64 లక్షల దాకా బకాయిలు చెల్లించకపోవటంతో ఆమెను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించినట్లు బీబీసీ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి.   ఈ నేపథ్యంలో ఆమె అది నిజం కాదంటూ ఖండించటం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement