
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
శివాజీనగర్/వర్ని : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 41వ జన్మదినోత్సవాన్ని ఆదివారం జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరిపారు. జిల్లాకేంద్రంలోని గాయత్రినగర్‌లో పార్టీ అధికార ప్రతినిధి గైనికాడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. ఈసందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన పోరాడే నాయకుడన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి జిల్లా నుంచి పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ జిల్లాల్లో పార్టీని మరింత బలపర్చేందుకు క్షేత్రస్థాయి నుంచి కృషిచేస్తున్నామన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. నాయకులు ప్రమోద్, నవీన్, స్వరూప, లక్ష్మి, కిషన్, రాజా, భిక్షపతి పాల్గొన్నారు.
వర్నిలో
మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శ్రీనివాసకాలనీలోని చర్చికి వెళ్లి పాస్టర్ రవిబాబు సమక్షంలో ప్రార్థనలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా నాయకుడు జలాల్‌పూర్ తజ్ముల్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ సాధన కోసం కృషిచేస్తున్నారన్నారు.
ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ మండల కన్వీనర్ గంగుల లలేందర్, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ విశ్వచారి, సంజయ్, అభిమాన్యు, నిఖిల్, విజయ్, జానిబాబా పాల్గొన్నారు.