జగన్ కోసం పూజలు | worshiped for jagan : vijaya lakshmi | Sakshi
Sakshi News home page

జగన్ కోసం పూజలు

Published Fri, Sep 27 2013 2:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి

రాజమండ్రిసిటీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి  ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి గురువారం రాజమండ్రి గౌతమఘాట్‌లోని అయ్యప్పస్వామి గుడిలో సాయిబాబా విగ్రహాన్ని పాలతో, విభూతితో అభిషేకించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్‌ను  485 రోజుల పాటు జైలులో పెట్టారన్నారు. ఏతప్పు చేయనందునే ఆయన కడిగిన ముత్యంలా బయట పడ్డారన్నారు. అనంతరం అఖండ జ్యోతిని వెలిగించారు. రాజమండ్రి సిటీ, రూరల్ కో-ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం రమణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు లంక సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యులు మాసా రామజోగ్, నగర అధికార ప్రతినిధులు కె. సాగర్, డి. వీరబాబు, దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ ఇసుకపట్ల శ్రీనివాస్, నగర వీవర్స్‌సెల్ కన్వీనర్ కోటా, వైఎస్సార్ సేవాసమితి అధ్యక్షుడు కె. సాయి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement